BALALAYAM IN SRIVARI TEMPLE IN ALIPERI PADALA MANDAPAM _ అలిపిరి పాదాల మండ‌పం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌శ్వ‌మివారి ఆలయంలో శాస్త్రోక్తంగా బాలాల‌యం

Tirumala, 01 March 2025: Srivari darshan will not be available for the devotees from March 01 till March 17 due to Balalayam in the temple.

Balalaya Samprokshan programs started on Saturday morning due to Ashtabandhan at Sri Venkateswara Swamy Temple at Alipiri Padala Mandapam and Sri Goda Ammavari Temple attached to Sri Lakshmi Narayana Swamy Temple in Tirupati.  These programs will end on March 3.

 As part of this, Punyahavachanam, Vastu Homam, Akalmasha Homam, Rakshabandhanam and other Vedic programs were performed on March 1.

At 6pm Kumbhasthabhana, Kalakarshana, Agni Pratishtha, were performed in Yagashala along with Vedic programs.

On 2nd March at 8am, Pancha Gavyadivasam, Ksheeradhivasam and Jaladhivasam will be performed in Yagashala.   

On 3rd March at 8 am, Yagashala Vedic programs, Purnahuti and Kumbha Pradakshina will be performed.  Balalaya Samprokshanam will be conducted in Mesha lagnam between 9.20 am to 9.55 am.

Sri Venugopala Deekshitulu, one of the head priests of Srivari Temple, Sri Mohana Rangacharya, Vaikhanasa Agama Advisor, Temple AEO Sri Muni Krishna Reddy, Advisors Sri Sitaramacharyulu, Rutviks and other dignitaries participated in this program.

The devotees are appealed to observe this matter and cooperate.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అలిపిరి పాదాల మండ‌పం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌శ్వ‌మివారి ఆలయంలో శాస్త్రోక్తంగా బాలాల‌యం

తిరుపతి, 2025 మార్చి 01: తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆలయం, శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మ‌వారి ఆల‌యంలో అష్ట‌బంధ‌నం కార‌ణంగా శ‌నివారం ఉద‌యం బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభ‌మ‌య్యాయి. మార్చి 3వ తేదీన పూర్ణాహుతితో ఈ కార్య‌క్ర‌మాలు ముగియ‌నున్నాయి.

ఇందులో భాగంగా మార్చి 1న ఉద‌యం 8 గంట‌ల‌కు పుణ్యాహవచనం, వాస్తు హోమం, అక‌ల్మ‌ష హోమం, ర‌క్షాబంధ‌నం, ఇత‌ర వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. సాయంత్రం 6 గంట‌ల‌కు కుంభ‌స్థాప‌న, క‌ళాక‌ర్ష‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, కుంభాల‌ను యాగశాల‌కు తీసుకొచ్చి వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

మార్చి 2వ తేదీ ఉదయం 8 గంట‌ల‌కు యాగ‌శాల‌లో పంచ గ‌వ్యాదివాసం, క్షేరాధివాసం, జలదివాసం నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

మార్చి 3వ తేదీ ఉదయం 8 గంట‌ల‌కు యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, కుంభ ప్ర‌ద‌క్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఉద‌యం 9.20 నుండి 9.55 గంట‌ల మ‌ధ్య మేష‌ ల‌గ్నంలో బాలాల‌య సంప్రోక్ష‌ణం చేప‌డ‌తారు.

గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు,వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ మోహ‌న రంగాచార్యులు, రుత్వికులు, ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

ఆలయ ఏఈఓ శ్రీ ముని కృష్ణారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, సలహాదారులు శ్రీ సీతారామచార్యులు, కంకణబట్టర్ శ్రీ మురళీకృష్ణ చార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.