BAN ON POLITICAL SPEECHES IN TIRUMALA _ తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం

LEGAL ACTION IF VIOLATED

Tirumala, 30 November 2024: TTD has decided to ban political and hate speeches in Tirumala to protect the sanctity and spiritual peace of Tirumala. 

In the sacred Tirumala divine temple, which always reverberates with Govinda Namas, in the recent times, some of the person and political leaders after the darshan in Tirumala temple, making political and hate statements before the media in front of the temple,  disturbing the spiritual atmosphere in Tirumala. 

In this context, the TTD board has taken a decision to ban political and hate speeches in Tirumala to protect its sanctity.

TTD also appeals to everyone to cooperate with its decision. It is informed that legal action will also be taken by TTD against the violators.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం

•⁠ ⁠నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

తిరుమల, 2024 నవంబరు 30: తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది.

నిత్యం గోవింద నామాలతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో, గత కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులలో కొంతమంది, దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది.

ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది.

తిరుమలకు విచ్చేసి రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతీసే ప్రసంగాలకు దూరంగా ఉండి టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది.

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేయడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.