BANGARU TIRUCHI ON DAY 1 OF SRIVARI NAVARATRI BRAHMOTSAVAM _ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Tirumala, 16 Oct. 20: The Srivari Navaratri Brahmotsavam-2020 kicked off on Friday at Srivari temple in ekantham due to COVID-19 restrictions.
After the Vedic programs in the Yogashala, the utsava idols of Sri Malayappaswami along with consorts Sri Devi and Sri Bhudevi were paraded within the Vimana prakaram of Srivari temple on Bangaru Tiruchi.
Thereafter they were seated in asthanam at the Ranganayakula Mantapam.TTD EO Dr K S Jawahar Reddy was tied Kankana for Brahmotsavam by the archakas on the occasion.
Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy, Sri Sri Sri Chinna Jeeyarswamy, MP Sri Vemireddy Prabhakar Reddy, Additional EO Sri A V Dharma Reddy, TTD Board Members Sri DP Anant, Smt Prashanti Reddy, Chief archaka Sri Venugopala Dikshitulu, Kankanabhattar Sri Ramakrishna Dikshitulu, DyEO of Srivari temple Sri Harindranath, VGO Sri Manohar, Peishkar Sri Jaganmohanacharyulu and other officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
2020 శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అక్టోబరు 16, తిరుమల 2020: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేపట్టారు. ఆ తరువాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆస్థానం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డికి అర్చకులు కంకణధారణ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, కంకణభట్టార్ శ్రీ రామకృష్ణ దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విజిఓ శ్రీ మనోహర్, పేష్కార్ శ్రీ జగన్‌మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.