BHAKTA PRAHLADA CAPTIVATES _ బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు _ మహతిలో ఆకట్టుకున్న భక్తప్రహ్లాద నాటక ప్రదర్శన

TIRUPATI, 16 OCTOBER 2023:The Bhakta Prahlada mythological drama enacted by Surabhi artists captivated the audience on Monday evening.

As a part of the ongoing Navaratri brahmotsavams, TTD has organized different cultural and devotional programs on various platforms of which Bhakta Prahlada was performed by 43 artists in Mahati Auditorium.

Likewise, devotional cultural programs were also organized at Ramachandra Pushkarini and Annamacharya Kalamandiram.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

– మహతిలో ఆకట్టుకున్న భక్తప్రహ్లాద నాటక ప్రదర్శన

 తిరుమల, 2023 అక్టోబ‌రు 16 ;   శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం తిరుమ‌ల‌, తిరుప‌తిలోని ప‌లు వేదిక‌ల‌పై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

 తిరుపతి మహతి కళాక్షేత్రంలో హైదరాబాదుకు చెందిన ‘సురభి’ శ్రీ వినాయక నాట్యకళామండలికి చెందిన శ్రీ ఆర్.వేణుగోపాలరావు 43 మందితో కూడిన తమ బృందంతో “భక్తప్రహ్లాద ” నాటక ప్రదర్శన వీక్షకులను అలరించింది.

ఈ నాటకప్రదర్శన – నారదుని రాకతో ప్రారంభమైంది. జయవిజయులతో సనకసనందుల సంవాదం, వారిని శపించుట, వారు హిరణ్యాక్ష-హిరణ్యకశిపులుగా జన్మించుట, హిరణ్యాక్ష మరణానంతరం హిరణ్యకశిపుడు బ్రహ్మకై తపస్సుచేసి వరం పొందుట, తన భార్య లీలావతి పుత్రుని కనుట, అతనికి ప్రహ్లాదుడని పేరుపెట్టడం, అతని అనితర విష్ణునామ కీర్తన విన్న హిరణ్యకశిపుడు ఆపై అతనిని హింసించడం, తండ్రి హరిని చూపమనగా, స్తంభం నుండి నరసింహునిగా ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి లోకములను కాపాడడంతో ప్రదర్శన ముగిసింది.

రామచంద్రపుష్కరిణి వేదికపై దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎ.అమృతవల్లి బృందం భక్తిసంగీతం ఆకట్టుకుంది.                        
                             
 తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో ఉద‌యం వేద సందేశం, శ్రీమతి ప్రసన్నలక్ష్మీ బృందం విష్ణుస‌హ‌స్ర‌నామ‌పారాయ‌ణం, దాస‌సాహిత్య ప్రాజెక్టుకు చెందిన శ్రీమ‌తి వీణ బృందం భ‌క్తి సంగీతం, ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టుకు చెందిన శ్రీమతి కెవి.జానకమ్మ భ‌క్తామృతం ధార్మికోప‌న్యాసం, సాయంత్రం శ్రీమతి రేవతి, శ్రీమతి కవిత బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు, రాత్రి శ్రీమ‌తి వరలక్ష్మీ బృందం హ‌రిక‌థా పారాయ‌ణం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీమతి బినతి, శ్రీమతి శ్రీలత బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం భ‌క్తుల‌కు భ‌క్తిభావాన్ని పంచింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.