BHASHYAKARLA UTSAVAM COMMENCES _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ఉత్సవం ప్రారంభం
TIRUPATI, 26 APRIL 2022: The annual Bhashyakarla Utsavam in Sri Govinda Raja Swamy temple in Tirupati commenced on Tuesday.
The procession of Bangaru Tiruchi was observed at 7:30am.
Later Chinna Mada Veedhi Utsavam will be followed in the evening between 5:30pm and 7pm succeeded by Pedda Mada Veedhi Utsavam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ఉత్సవం ప్రారంభం
తిరుపతి, 2022 ఏప్రిల్ 26: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవం మంగళవారం ప్రారంభమైంది. మే 4న భోగి తేరు, మే 5న సాత్తుమొర జరుగనున్నాయి.
ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం భాష్యకార్ల వారికి బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం(నాలుగు మాడ వీధులు) జరిగింది. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాత్తుమొర, ఆస్థానం జరిగింది. సాయంత్రం పెద్దమాడ వీధి ఉత్సవం(కర్ణాల వీధి, గాంధీ రోడ్ మీదుగా) చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి విఆర్.శాంతి, ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఏఈవో శ్రీ రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ కామరాజు, శ్రీ ధనుంజయ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.