BHASHYAKARLA UTSAVAM COMMENCES IN SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ఉత్సవం ప్రారంభం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ఉత్సవం ప్రారంభం
తిరుపతి, 2021 ఏప్రిల్ 09: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ఏప్రిల్ 18వ తేదీ వరకు జరుగనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు భాష్యకార్ల వారిని విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఏప్రిల్ 18న సాత్తుమొర జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్‌రెడ్డి, ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాసదీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునీంద్రబాబు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati, 9 Apr. 21: The Bhashyakarla Utsavam commenced in Sri Govindaraja Swamy temple on Friday in Tirupati.
The processional deity of Sri Bhashyakarlavaru paraded along Vimana Prakaram in the evening.
Spl. Gr DyEO Sri Rajendrudu and others participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI