BHASHYAKARLA UTSAVAM HELD IN GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ భాష్యకార్ల ఉత్సవం
TIRUMALA, 23 APRIL 2025: The Bhashyakara Utsavam was held in Sri Govindaraja Swamy temple on Wednesday evening.
As a part of this fete, Chinna Mada Veedhi Utsavam and Pedda Mada Veedhi Utsavam were observed.
HH Sri Pedda Jeeyar Swamy, HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, DyEO Smt Shanti, AEO Sri Munikrishna Reddy, Temple Inspector Sri Dhananjaya and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ భాష్యకార్ల ఉత్సవం
తిరుపతి, 2025 ఏప్రిల్ 23: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మే 2వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది.
ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు పెద్దమాడవీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ ధనంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.