‘BHOOMI PUJA’ PERFORMED WITH RELIGIOUS FERVOUR IN KANYAKUMARI _ కన్యాకుమారిలో శ్రీవారి ఆలయానికి శాస్త్రోక్తంగా భూమిపూజ
KANYAKUMARI, JUNE 4: The ceremonious “Bhoomi Puja” has been performed with religious fervour in the city of Kanyakumari on Tuesday for the construction of the new temple of Lord Venkateswara.
This ceremony has been performed in strict conformance to Vaastu Shastra as per Vaikhanasa Agama by a team of priests on Tuesday between 6am to 8am. The priests rendered Maha Sankalpam in the yaga Sala and performed celestial Homam with Ganapathi Aradhana seeking the blessings of Goddess Earth (Bhoomi Devi) before starting up the construct works of the massive Lord Venkateswara temple which is coming up in the sprawling 4.5acres of land at a cost of Rs.22.5crores.
Apart from the Lord Venkateswara temple, there will also be a temple for Goddess Padmavathi Devi and a temple tank (Swamy Pushkarini) on the lines of Tirumala temple. With an aim to protect Hindu Sanatana Dharma, a Goshala (cow shed), Veda Patasala (spiritual vedic schools), Potu (temple Kitchen) and Anna Prasada Bhavanam (free mass feeding centre) will also be taking shape in this huge piece of land.
After the puja, the TTD Chairman Sri K Bapiraju and TTD EO Sri LV Subramanyam unveiled the foundation stone for the series of works that are taking place in this area and named the place as “Tirupati Puram”.
Speaking on this occasion TTD Chairman said, it is indeed a ceremonious moment to start the temple works in the land of art and religious significance-Kanyakumari encircled by a serene atmosphere. “This place is known for Vivekananda Rock, Tiruvalluvar Statue and henceforth will also become a place of pilgrim importance with the upcoming shrine of Lord Venkateswara by next year. Few days ago we have inaugurated a temple of Lord Balaji in country’s capital and yesterday in Dehradun, the Uttarakhand CM also donated an acre land. One more temple will be coming up in the historical city of Kurukshetra also. With large number of philanthropists coming forward to join hands with TTD in the noble mission of spreading Sri Venakteswara Bhakti cult, construction of replica temples of Lord Venkateswara is becoming reality in many important cities in the country. “, he maintained.
Later in his address, TTD EO Sri LV Subramanyam said, “It is a great day since the historical land of Kanyakumari known for the temple of Kanyakumari is soon being remembered for yet another place of importance with this temple of Lord Venkateswara which will be coming up here by next year. Thanks to the efforts of local committee members Sri Balakrishna and Hanumantha Rao who took keen interest in obtaining a very important place for the noble purpose. Today, being the most auspicious Ekadasi day, the homam and Bhoomi Pooja have been celebrated with the sacred waters brought from 108 Vaishnava temples across the country. Kanyakumari which is an important tourist spot will soon become an important place of pilgrimage tourism also with the advent of the Lord Venkateswara temple which is in offing”, he maintained.
TTD Board Member Sri LR Siva Prasad, TTD CE Sri Chandra Sekhar Reddy, EE 12 Sri Jagadishwar Reddy, LAC members and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కన్యాకుమారిలో శ్రీవారి ఆలయానికి శాస్త్రోక్తంగా భూమిపూజ
తిరుపతి, జూన్ 04, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారతదేశ దక్షిణాగ్రమైన కన్యాకుమారిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణానికి మంగళవారం శాస్త్రోక్తంగా భూమిపూజ జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే ఈ ఆలయ నిర్మాణం చేపడుతోంది.
కన్యాకుమారిలోని వివేకానందపురంలో గల వివేకానంద కేంద్రం ప్రాంగణంలో ఉదయం 6.00 నుండి 7.30 గంటల నడుమ వేదమంత్రోచ్ఛారణలతో వైఖానసమోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా గోపూజ, యంత్రస్థాపన, వాస్తుపూజ, శాంతిసూక్త హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. భూమాత ఆశీస్సుల కోసం గణపతి హోమం చేపట్టారు. భారతీయ హిందూ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద ఈ ప్రాంగణంలోనే ధ్యానం చేసినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ కూడా ఇక్కడ అనేక ఆధ్యాత్మిక రచనలు చేశారు.
మొత్తం నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.22.50 కోట్ల వ్యయంతో ఇక్కడ ఆలయం నిర్మాణం కానుంది. ఇందులో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతోపాటు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, స్వామి పుష్కరిణి, యాగశాల, పోటు, అన్నప్రసాద భవనం, గోసంరక్షణశాల, అర్చకుల వసతిగృహం, వేద పాఠశాల నిర్మించనున్నారు. భూమిపూజ అనంతరం తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం కలిసి ఆలయ పనులు చేపడుతున్న ‘తిరుపతిపురం’ ప్రాంతానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శ్రీ కనుమూరు బాపిరాజు మాట్లాడుతూ కళలకు, ఆధ్యాత్మికతకు నెలవైన కన్యాకుమారి దివ్యక్షేత్రంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారి ఆలయం నిర్మించడం చాలా సంతోషకరమన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న వివేకానంద, తిరువళ్లువర్ విగ్రహాలతోపాటు వచ్చే ఏడాది నాటికి శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి కానుండడంతో ప్రముఖ యాత్రాస్థలంగా అభివృద్ధి చెందగలదన్నారు. ఇటీవల దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో ప్రారంభించిన శ్రీవారి ఆలయానికి భక్తుల నుండి విశేష స్పందన లభించిందన్నారు. రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి డెహ్రాడూన్‌లో ఒక ఎకరా స్థలాన్ని శ్రీవారికి అందించారని వివరించారు. చారిత్రక ప్రదేశమైన హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో మరో శ్రీవారి ఆలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర తత్వాన్ని వ్యాప్తి చేయాలనే తలంపుతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తితిదే చేపడుతున్న శ్రీవారి ఆలయాల నిర్మాణానికి అనేకమంది దాతలు సహకరిస్తున్నట్టు ఆయన తెలిపారు.
తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ కన్యాకుమారి లాంటి మరొక చారిత్రక ప్రదేశంలో తిరుమల శ్రీవారికి ఆలయం నిర్మాణమవుతుండడం శుభపరిణామమన్నారు. అత్యంత ముఖ్యమైన ప్రాంతంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం లభించేందుకు కృషి చేసిన స్థానిక కమిటీ సభ్యులు శ్రీ బాలకృష్ణ, శ్రీ హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని 108 వైష్ణవాలయాల నుండి తెచ్చిన పవిత్రజలాలతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున హోమం, భూమిపూజ నిర్వహించడం విశేషమన్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే పాలకమండలి సభ్యులు శ్రీ ఎల్‌ఆర్.శివప్రసాద్, చీఫ్ ఇంజినీరు శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఈఈ-12 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, చెన్నై స్థానిక సలహామండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.