BIG THUMBS UP TO CULTURAL PROGRAMS _ ఆకట్టుకుంటున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

TIRUPATI, 20 NOVEMBER 2025: The cultural programs organised by TTD on various platforms during the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor had won the hearts of art lovers.

The Mahati, Annamacharya Kalamandiram, Asthana Mandapam at Tiruchanoor are hosting unique devotional programs everyday impressing devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఆకట్టుకుంటున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి, 2025, నవంబర్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు ఆస్థాన మండపం, తిరుచానూరు శిల్పారామం, తిరుపతి మహాతి ఆడిటోరియం, అన్నమాచార్య కళామందిరం, శ్రీ రామచంద్ర పుష్కరిణిలో నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

తిరుచానూరు ఆస్థాన మండపంలో ఉదయం 4.30 గం.లకు శ్రీ పి. నటరాజ, డోలు శ్రీ జి. చంద్రశేఖర్  ఆధ్వర్యంలో మంగళధ్వనికి నాదస్వరం, ఉదయం 5.30 గం.లకు  శ్రీమతి ప్రసన్నలక్ష్మీ ఆధ్వర్యంలో లక్ష్మీ సహస్రనామ పారాయణం, ఉదయం 10 గం.లకు వరంగల్ కు చెందిన డా. సముద్రాల శఠగోపాచార్యులు నేతృత్వంలో భక్త్యామృతం ధార్మిక ఉపన్యాసం, ఉదయం 11 గం.లకు శ్రీమతి లలిత శివజ్యోతి బృందం ఆధ్వర్యంలో భక్త సంగీతం కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గం.లకు శ్రీమతి వి.విజయకుమారి బృందం ఆధ్వర్యంలో హరికథ, సాయంత్రం 4 గం.లకు శ్రీ ఎన్. శ్రీహరి బృందం ఆధ్వర్యంలో అన్నమయ్య విన్నపాలు వినిపించారు.

అదే విధంగా, తిరుపతి మహతి ఆడిటోరియంలో సాయంత్రం కుమారి ఆర్తి బృందం భక్తి సంగీతం,  శ్రీమతి భాగవతుల శిరీషరాణి బృందం ఆధ్వర్యంలో నృత్య కార్యక్రమం చేపట్టారు.   తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం శ్రీమతి జ్యోత్స్య లక్ష్మీ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, తదుపరి కుమారి నయన ప్రియ బృందం కూచిపూడి నృత్యం, శ్రీరామచంద్ర పుష్కరిణి ఆధ్వర్యంలో ఎన్.వి.సి.ఎం.డి విద్యార్థులు గాత్ర కచేరి, కుమారి ఎం. వైష్ణవి బృందం భరతనాట్యం , శిల్పారామంలో మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ చంద్రశేఖర్ రావు బృందంచే భక్తి సంగీతం అందించారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.