BIHU, SONGI MUKHOTA, DRUMS STEALS THE SHOW _ మోహినీ అలంకారంలో అలరించిన బిహు, సోంగి ముఖోటా, డ్రమ్స్ నృత్యం

TIRUMALA, 19 OCTOBER 2023: On the fifth day morning of the ongoing Navaratri Brahmotsavams in Tirumala, the unique art forms performed by artists from different states attracted the devotees.

Bihu is a traditional folk dance and is the state dance of Assam which is usually performed by young men and women welcoming the spring season. A team of 25 artists performed this dance in front of Mohini Avatarm on Thursday with rhythmic steps to the beats of the drums. 

The another one which captivated the devotees is that of Songi Mukhota, a Maharashtrian folk dance where in the 25 members wearing costumes weighing around 25 kilos presented a colourful performance. 

Others included Kavadi Nrityam, Koalatams, portrayal of various mythological characters etc. all through the mada streets with paraphernalia led by the finely decorated temple elephants, horses and bulls.

A total of 12 troupes with 313 artists performed before Mohini Avataram. Under the instructions of JEO for Health and Education Smt Sada Bhargavi, All Programs Officer Sri Rajagopal, Dasa Sahitya Project Special Officer Sri Ananda Theerthacharyulu supervised the programmes.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మోహినీ అలంకారంలో అలరించిన బిహు, సోంగి ముఖోటా, డ్రమ్స్ నృత్యం

తిరుమల, 2023 అక్టోబ‌రు 19: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం మోహినీ అలంకారంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన అపూర్వ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం 12 కళాబృందాల్లో 313 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలిచ్చారు.

బిహు అనేది అస్సాం రాష్ట్ర సాంప్రదాయ జానపద నృత్యం. ఇది సాధారణంగా వసంత రుతువును స్వాగతిస్తూ యువతీ యువకులు ప్రదర్శించే నృత్యం. 25 మంది కళాకారుల బృందం డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధమైన అడుగులతో ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం సోంగి ముఖోటాను పూణేకి చెందిన రాజి బృందం ప్రదర్శించింది. 25 మంది సభ్యులు 25 కిలోల బరువున్న రంగురంగుల దుస్తులు ధరించి చక్కగా ప్రదర్శించారు.

అదేవిధంగా, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల మోహినీ అవతార నృత్య ప్రదర్శన భక్తులను సమ్మోహనపరిచింది. రాజమండ్రికి చెందిన దుర్గా నాగమణి బృందం చేసిన డప్పు నృత్యం కనువిందు చేసింది. హైదరాబాదుకు చెందిన అభిరామి బృందం ఒడిస్సీ నృత్యంతో అలరించారు. తెలంగాణ రాష్ట్రం, వరంగల్ ప్రాంతానికి చెందిన రాహుల్ బృందం కావడి నృత్యాన్ని ప్రదర్శించారు. రాజమండ్రికి చెందిన పి.సుమన్ డ్రమ్స్ విన్యాసాలతో ముగ్ధులను చేశారు. కొత్తగూడెంకు చెందిన పి.వాసు బృందం కోలాటాలతో అలరించారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పి.రవితేజ బృందం గోపిక కృష్ణుడు వేషధారణతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. కర్నాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా, కంప్లికి చెందిన కె. కృష్ణ బృందం కొంబు కహాలే అనే జానపద కళారూపాన్ని ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. బెంగళూరు విద్యారణ్యపురికి చెందిన ఎస్.దివ్యశ్రీ సంకీర్తన కుసుమాంజలితో అలరించారు. తిరుమల బాలాజీ నగర్ కు చెందిన డి.శ్రీనివాసులు బృందం కోలాటాలతో అలరించారు.

టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశాల మేరకు ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి శ్రీ రాజగోపాల్‌, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.