BIRRD LAUNCHES FIRST BIONIC HAND IN THE COUNTRY _ దేశంలో తయారైన తొలి బయోనిక్ హ్యాండ్ ప్రారంభ సభలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirupati, 3 Dec 20: The TTD-run BIRRD Orthopedic hospital launched the country’s first Bionic Hand on Thursday. 

Participating in the event via video conference in the Conference Hall at BIRRD, TTD Trust Board Chairman Sri YV Subba Reddy said, under the instructions of Honourable CM of AP BIRRD will be developed in to a super speciality hospital in the field of treating Ortho related ailments. 

He said he is so happy that the Hospital has launched the Bionic Hand, a revolution in the field of artificial limb usage in medicine on the day of International Day of Persons with Disability. 

Later he interacted with Ms.Gayathri from Hyderabad to whom the first bionic hand was inserted. She expressed immense satisfaction over the functioning of the hand which is arranged to her left arm. 

Meanwhile the Makers Hive firm which has created this arm inspired by former President of India, Late Sri Abdul Kalam named it after him as “Kal Arm”(the arm of future for the needy). 

According to representatives of Bionic Hand makers, this artificial hand costs around 35-40lakhs in foreign nations while they are manufacturing per piece at Rs.2.75lakhs only. The hand has the capacity to lift nearly 8kilos. 

TTD JEO Sri P Basanth Kumar, BIRRD Director Dr Madan Mohan Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTs, TIRUPATI 

అంగవైకల్యం శాపం కారాదు

– బర్డ్‌ను దేశంలోనే అత్యున్నత ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం

–  దేశంలో తయారైన తొలి బయోనిక్ హ్యాండ్ ప్రారంభ సభలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 03: అంగవైకల్యం ఎవరికీ శాపం కారాదని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అన్నారు.  ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు బర్డ్‌ను దేశంలోనే అత్యున్నత సేవలు అందించే ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. బర్డ్‌ ఆసుపత్రి సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  దేశంలోనే తొలి బయోనిక్ హ్యాండ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 1985 నుంచి బర్డ్‌ ఆసుపత్రి ఉన్నత ప్రమాణాలతో పేదలకు సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో గొప్ప ఆర్థో పెడిక్ ఆసుపత్రిగా పేరు సాధించిందని చెప్పారు. సర్జరీలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.  ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కృత్రిమ అవయవాల తయారీ లోను, వికలాంగులకు శిక్షణ లోను దేశంలో నెంబర్ 1 ఆసుపత్రిగా తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

భారతదేశపు మొట్టమొదటి బయోనిక్ హ్యాండ్ ‘కల్ఆర్మ్’ ను  తాను  ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఇది తనకు ఇచ్చిన అదృష్టంగా  భావిస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. దివంగత మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం  స్పూర్తితో  అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ఇతరదేశాల్లో 35 నుంచి 40 లక్షల ఖర్చయ్యే బయోనిక్ హ్యాండ్ ను మేకర్స్ హైవ్ సంస్థ రూ.2.75 లక్షల లోపు ఖర్చుతోనే అందుబాటులో కి తేవడం సంతోషమన్నారు. దీనివల్ల వికలాంగుల సమస్యకు పరిష్కారం ల‌భించి వారి జీవితాల్లో మార్పు వ‌స్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. టీటీడీ నేతృత్వంలో నడుస్తున్న బ‌ర్డ్ ఆసుప‌త్రిలో బయోనిక్ హ్యాండ్ ను ప్రారంభించడం ఆనందకరమన్నారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో నడుస్తున్న ప్రాణదానం పథకం ద్వారా పేదలకు  వీలైనంత మేరకు ఉచితంగా వీటిని అందించే ప్రయత్నం చేస్తామన్నారు. దాతల ద్వారా కూడా కొందరికి ఈ సహాయం అందించే ఆలోచన చేస్తామని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.  కళ్ళు లేని వారికి చూపు తెప్పించే బయోనిక్ కళ్ళు తయారు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించడం అభినందనీయమన్నారు.  అప్ప‌ర్ లింబ్ చికిత్స ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌త్యేక ప్ర‌తిభావంతుల్లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపి వారికి వృత్తిప‌ర‌మైన అవ‌కాశాలు క‌ల్పించేందుకు, అనేకమంది జీవితాలను మార్చడానికి బయోనిక్ హ్యాండ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  దేశంలో తొలిసారి ఈ బయోనిక్ హ్యాండ్ అందించిన హైదరాబాద్ కు చెందిన శ్రీమతి గాయత్రితో చైర్మన్ మాట్లాడి ఆమెను ఆశీర్వదించారు. కల్ఆర్మ్ బయోనిక్  హ్యాండ్ పూర్తి స్వదేశీ ప‌రిజ్ఞానంతో త‌యారు చేయడం సంతోషమన్నారు. హైవ్ సంస్థ సహకారంతో బ‌ర్డ్ ఆసుపత్రిలో ఒక యాంప్యూటీ ఫిట్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి,  దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను క‌ల్పిస్తామని ఆయన చెప్పారు.

టీటీడీ జెఈఓ, బర్డ్‌ డైరెక్టర్ శ్రీ బసంత్ కుమార్ మాట్లాడుతూ బర్డ్‌లోని కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం దేశంలో అత్యుత్తమమైనదన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ఆధునీకరించి, కృత్రిమ అవయవాల తయారీలో శిక్షణ ఇచ్చే డిప్లొమా కోర్స్ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ప్రాణదానం పథకం, దాతలు, ప్రభుత్వ సహాయం తో బర్డ్ ను దేశంలో అత్యున్నత ఆసుపత్రిగా తయారుచేసే ప్రయత్నం చేస్తామన్నారు.

బర్డ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మేకర్స్ హైవ్ సంస్థ తయారు చేసిన బయోనిక్ హ్యాండ్ సాధారణ మనుషులు చేసే అన్ని పనులు చేయగలదని అన్నారు. 8 కిలోల బరువు ఎత్తగలిగేలా తయారు చేసిన బయోనిక్ హ్యాండ్ ఎలా పని చేస్తుందనే విషయాలను సంస్థ ప్రతినిధులు ప్రణవ్, విశ్వనాథ్ వివరించారు. 18 రకాల గ్రిప్ లతో ఉపయోగించగలిగే ఈ హ్యాండ్ ను వికలాంగులకు అవసరమైన కొలతల్లో తయారు చేస్తామని తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.