BIRRD SHOULD BE IN NUMERO UNO PLACE IN SURGERIES-TTD EO _ మస్తిష్క పక్షవాత ( సెరిబ్రిల్ పాలసి) నిర్ధారణ, చికిత్సలో బర్డ్ ఉన్నత స్థానంలో ఉండాలి _ – టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

TIRUPATI, 20 SEPTEMBER 2021: TTD-run BIRRD Ortho super speciality hospital should stand first in Ortho related disease detection and surgeries, said TTD EO Dr KS Jawahar Reddy.

Reviewing on BIRRD activities at Sri Padmavathi Rest House in Tirupati, the EO said the hospital should be made into a centre for treating Cerebral Palsy detection and surgeries.

He directed the officials concerned to come out with an action plan on men power requirement, area to set up an exclusive ward to treat such cases etc.

He later instructed the concerned officials to visit AIIMS to observe the quality of treatment being extended to their patients and implement the same standards in BIRRD also.

The EO directed the Engineering Officials to prepare designs to set up a Canteen in BIRRD. He also instructed to take measures to procure required medicines directly from BIRRD instead of enroute through Chief Medical Officer of TTD.

Additional EO Sri AV Dharma Reddy, FACAO Sri Balaji, CE Sri Nageswara Rao, RMO Sri Sesha Sailendra, OSD of BIRRD Dr Reddeppa Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మస్తిష్క పక్షవాత ( సెరిబ్రిల్ పాలసి) నిర్ధారణ, చికిత్సలో బర్డ్ ఉన్నత స్థానంలో ఉండాలి- టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

తిరుపతి 20 సెప్టెంబరు 2021: మస్తిష్క పక్షవాత ( సెరిబ్రిల్ పాలసి) నిర్ధారణ, చికిత్సలో బర్డ్ ఆసుపత్రిని ముఖ్యమైన కేంద్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శ్రీ పద్మావతి అతిథిగృహంలో సోమవారం సాయంత్రం ఆయన బర్డ్ ఆసుపత్రి అభివృద్ధి అంశాలపై సమీక్ష జరిపారు. సెరిబ్రిల్ పాలసీ నిర్ధారణ, చికిత్సకు కావలసిన ఏర్పాట్లకు సంబంధించిన స్థలం, సిబ్బంది ఎంత అవసరమో ముందుగా ఒక అంచనాకు రావాలని అధికారులకు ఈవో సూచించారు. ఆస్పత్రి నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడం, సాఫ్ట్వేర్ తయారీ లాంటి అంశాల పరిశీలన కోసం దేశంలో ఉన్నతమైన ఢిల్లీ ఎయిమ్స్ లాంటి ఆసుపత్రులను పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

బర్డ్ లో అవసరమైన మేరకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని నియమించుకోవాలని ఈవో అధికారులకు సూచించారు. సిటి స్కాన్ యంత్రాన్ని వీలైనంత త్వరగా కొనుగోలు చేయాలన్నారు. బర్డ్ లో క్యాంటీన్ ఏర్పాటు కోసం డిజైన్లు సిద్ధం చేయాలని, పాత ఆస్పత్రిలోని వార్డుల ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు. బర్డ్ కు అవసరమైన మందులు టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ద్వారా కాకుండా బర్డ్ ఆస్పత్రి నుంచే కొనుగోలు చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, ఎఫ్ ఎ అండ్ సీఎవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆర్ఎంఓ శ్రీ శేష శైలేంద్ర, ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది