BOOKLET ON BTU OF SRI KRT RELEASED _ శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ ఆవిష్కరణ

Tirupati, 21 Mar. 22: TTD JEO Sri Veerabrahmam on Monday released the booklet on the annual Brahmotsavam of Sri Kodandaramswami temple at the TTD administrative buildings conference hall.

 

Speaking on the occasion the TTD JEO said the Brahmotsavam of local temple Shall be grandly held from March 30-April 7 with Ankursrpanam fete on March 29.

 

He said other festivities like Ugadi Asthana on. April 2, Sri Ramanavami utsavam from April 10-12 and annual Teppotsavam from April 14-16 will also be grandly conducted.

 

Special grade DyEO Smt Parvati was present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ ఆవిష్కరణ

తిరుపతి, 2022 మార్చి 21: తిరుప‌తి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలనా భవనంలోని స‌మావేశ మందిరంలో సోమ‌వారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మార్చి 30 నుండి ఏప్రిల్ 7వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 29వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

ఏప్రిల్ 2న ఉగాది ఆస్థానం, ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి ఉత్స‌వాలు, ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు తెప్పోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు జెఈవో తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.