Books released _ చిన్నశేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
TIRUMALA, 05 OCTOBER 2024: Siva Puranam-4, Srimadbhagavatam-Vaignanika Visleshana, Purana Pariseelanamsalu, Eternal Glory of Tirumala Tirupati shrine, Bhagavadaradhana Vidhanam books published by TTD were released by TTD EO Sri J Syamala Rao in front of Chinna Sesha Vahanam
The authors of the books were felicitated.
Former TTD EO Sri LV Subramanyam, Annamacharya Project Director Dr Vibhishana Sharma, Sub Editor Sri Narasimhacharyulu and others were also present.
Both the Tirumala Pontiffs, and other officers were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చిన్నశేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుమల, 2024 అక్టోబరు 05: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం చిన్నశేష వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్కరించారు.
శ్రీమద్భాగవతం – వైజ్ఞానిక విశ్లేషణ
• ప్రొ॥ ఘనకోట వేంకటశాస్త్రి
శ్రీమద్భాగవతం జ్ఞాన-భక్తి-వైరాగ్య ప్రధానమైన గ్రంథం. శ్రీమద్భాగవతం 18 వేల శ్లోకాలు, 12 స్కంధాలతో కూడుకున్న హయగ్రీవ బ్రహ్మవిద్య. ఇంతటి మహత్తరమైన భాగవతాన్ని శ్రవణం చేయడానికి దేవతలు కూడా మానవజన్మను పొందాలని ఆశిస్తారు.
శ్రీమద్భాగవతం – వైజ్ఞానిక విశ్లేషణ (సృష్టిరహస్యాలు) అనే గ్రంథాన్ని ప్రొ॥ ఘనకోట వేంకటశాస్త్రి రచించారు. వీరు భాగవతంలోని అంశాలను వైజ్ఞానిక దృష్టితో పరిశీలించి సృష్టిక్రమము, అవయవాల ఉత్పత్తి, సౌరకుటుంబం, నక్షత్ర గ్రహమండలాలు మున్నగు విషయాలతో పాటు వివిధ శాస్త్రాల విశేషాలను, జీవ, రసాయన, భౌతిక, ఖోగోళశాస్త్రాలతో సమన్వయం చేసి విశ్లేషించారు.
పురాణాలు – పరిశీలనాంశాలు
• డా॥ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ
హిందువులకు వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ప్రమాణాలు. పురాణాల్లో ఆధ్యాత్మిక విషయాలేకాక సామాన్యులకు ఉపయోగపడే అనేక రీతుల నీతులు, ధర్మసూక్ష్మాలు కనిపిస్తాయి. అందుకే మన దేవాలయాల్లో నిరంతరం పురాణ ప్రవచనాలు జరుగుతుంటాయి.
పురాణాలలోని ప్రధాన విషయాలను మచ్చుకు కొన్ని ఉదాహరణలుగా చెప్పారేకాని, వివరంగా అన్నీ తెలుసుకోవాలంటే పురాణాలను సమగ్రంగా చదవాల్సిందే.
ఎటర్నల్ గ్లోరీ ఆఫ్ తిరుమల (ఇంగ్లీషు)
• ప్రొ॥ యం. రాజగోపాలాచారి
12 పురాణాల్లోని వేంకటాచల మాహాత్మ్య కథాసారాన్ని సరళమైన వచనంలో టీటీడీ తెలుగులో ఇదివరకే ముద్రించింది. ఈ వేంకటాచల మాహాత్మ్యం కేవలం తెలుగువారికే పరిమితం కాకూడదని హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో కూడా అనువదింపజేసి ముద్రిస్తున్నది.
భగవదారాధన విధానము
• శ్రీ వావిలికొలను సుబ్బారావు
భక్తజనుల హృదయాలలో నెలకొన్న పరమాత్మను ఆవిష్కరింపజేయటమే ఈ ఆరాధనా విధానాల ముఖ్యోద్దేశము. ఇది బాహ్య, ఆంతరంగిక లేక మానసికమని రెండు విధాలు. బాహ్యపూజకు పూజాసామాగ్రి, విధివిధానాలు అవసరం. అదే మానసికారాధనకు ధ్యానం మాత్రమే చాలు. ఇది కష్టసాధ్యం కాబట్టి గృహస్థులకు బాహ్యపూజావిధానమే నిర్దేశింపబడిరది. బాహ్యపూజలో భగవంతుని విగ్రహానికి కాని, చిత్రపటానికి గాని పూజ చేయవచ్చును. ‘భగవదారాధనమనే’ ఈ పుస్తకములో లఘువిధానమని, గురువిధానమని రెండు రకములుగా వివరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ ఈవో శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విభీషణ శర్మ, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్య పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.