BOOST TO TRADITIONAL ART FORMS-EO _ సాంప్రదాయ కళల పోషణకు టీటీడీ కృషి- శిల్పకళాశాలలో మూడు రోజుల శిల్పకళా ప్రదర్శన, అమ్మకాలను ప్రారంభించిన ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
TIRUPATI, 13 FEBRUARY 2023: With a noble aim to sustain traditional art forms for future generations, TTD is giving a boost to such arts in a big way by organizing expos regularly, said TTD EO Sri AV Dharma Reddy.
Speaking during the inaugural session of the three-day expo at SV Sculpture Institute of TTD on Monday, the EO said the three-day expo is mulled at exploring new opportunities and encourages students who have opted for traditional art courses.
Many students from this great Institute of TTD are now settled as renowned sculptors, lecturers, and artists across the world. He also said TTD deposits Rs. One lakh for each student joining the Kalamkari painting course.
He appreciated the faculty of the Fine Arts Institution for designing students who are the future builders of the nation.
The EO and JEO for Health and Education Smt Sada Bhargavi inspected the stalls including wood, cement, metal and kalamkari works on display. Till February 15 the stalls will remain open from 10 am to 6 pm.
Devasthanams Education Officer Sri Bhaskar Reddy, Principal of SVITSA Sri Venkat Reddy, other faculty, and students were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సాంప్రదాయ కళల పోషణకు టీటీడీ కృషి
– శిల్పకళాశాలలో మూడు రోజుల శిల్పకళా ప్రదర్శన, అమ్మకాలను ప్రారంభించిన ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
తిరుపతి 13 ఫిబ్రవరి 2023 ; అంతరించిపోతున్న శిల్పకళ సాంప్రదాయ సంగీత, నృత్య కళలను పోషించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తోందని ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు.
టీటీడీ శిల్ప కళాశాలలో మూడు రోజులపాటు నిర్వహించే శిల్పకళా ప్రదర్శన, అమ్మకాలను సోమవారం ఈవో ప్రారంభించారు.
శిల్ప కళాశాల విద్యార్థులు తయారుచేసిన ఆలయ నిర్మాణం, శిల్ప, సుధా, దారు, లోహ శిల్పాలు, సాంప్రదాయ వర్ణ చిత్రాలు, కలంకారి చిత్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఈవో మాట్లాడుతూ, టీటీడీ అనేక హిందూ ధార్మిక కార్యక్రమాలతో పాటు, సాంఘిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోందనిచెప్పారు. ఇందులో భాగంగా 30 కి పైగా పాఠశాలలు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. శిల్పకళలో నైపుణ్యం సంపాదించిన వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు.
టీటీడీ శిల్ప కళాశాల నుంచి వెళ్లిన అనేక మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో మంచి స్థాయిలో ఉన్నారని ఆయన చెప్పారు. విద్యార్థులు శిల్పకళలో ప్రావీణ్యం సాధించి, శిల్పకళను బతికించాలని ఉద్భోదించారు. శిల్ప కళాశాలలో కలంకారి కోర్సులో చేరే విద్యార్థులకు కూడా అడ్మిషన్ సమయంలో రూ. లక్ష డిపాజిట్ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. శిల్ప కళాశాల నిర్వహణ, పరిసరాల వాతావరణం చక్కగా ఉందని అధ్యాపకులను, విద్యార్థులను ఈవో అభినందించారు.
జేఈవో శ్రీమతి సదా భార్గవి, డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్
శ్రీ వెంకటరెడ్డి తో పాటు వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్ళు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాగా,ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోజు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు శిల్ప కళా ప్రదర్శన, అమ్మకాలు జరుగుతాయి.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది