BRAHMOTSAVA VAHANA SEVAS CONCLUDES WITH ASWA AT VONTIMITTA _ అశ్వవాహనంపై శ్రీ కోదండరామస్వామి దర్శనం
VONTIMITTA /TIRUMALA, 13 APRIL 2025: The series of Brahmotsava Vahana Sevas concluded with the divine Aswa Vahanam on Sunday evening at Vontimitta Sri Kodandarama temple in Kadapa district.
The annual fete reached the penultimate day and Sri Kodandarama as Kalki, atop the divine Horse carrier, blessed His devotees.
Temple DyEO Sri Natesh Babu and others were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
అశ్వవాహనంపై శ్రీ కోదండరామస్వామి దర్శనం
ఒంటిమిట్ట / తిరుపతి 2025 ఏప్రిల్ 13: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.
వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు.
వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.