BRAHMOTSAVAMS COMMENCE AT VONTIMITTA SRI KODANDARAMA SWAMY TEMPLE WITH DWAJAROHANAM _ ధ్వజారోహణంతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Vontimitta, 2 April 2020: The prestigious Sri Ramanavami Brahmotsavams of the ancient, historic and TTD local temple of Sri Kodandarama Swamy at Vontimitta in YSR Kadapa district, commenced with Dwajarohanam event on Thursday morning.
The annual Brahmotsavams will last till April 11 and will be conducted in Ekantham in a simple manner as darshan activity for pilgrims in the temple is suspended as a part of corona virus precautionary initiative.
Only the temple Dyeo Sri Lokanatham, prime staff members and Archakas participated in the fete.
Earlier, as per Pancharathra Agama tradition, Dwajarohanam-the sacred flag hoisting ceremony was conducted by installing Garuda flag atop the temple pillar along with Nava kalasabhishekam invoking and inviting the galaxy of gods for the event. Sri Ramanavami festival and Sri Pothana Jayanti were also conducted
MLA PRESENTS VASTRAMS
Rajampeta MLA and TTD board member Sri Meda Mallikarjun Reddy presented Pattu Vastrams to Sri Kodandarama Swamy on his own behalf on the opening day of the ten-day fete.
SRI SITA RAMA KALYANAM ON APRIL 7
Sri Sitarama Kalyanam will be performed within the corridors of Sri Kodandarama Swamy temple on April 7 and the silk vastrams on behalf of state government will be presented for this celestial occasion. TTD has made all arrangements for live telecast of the event on SVBC channel.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఒంటిమిట్ట, 2020, ఏప్రిల్ 02: టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని పురాతన చారిత్రక ప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
ముందుగా, పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అదేవిధంగా, శ్రీరామనవమి, పోతన జయంతిని నిర్వహించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంలో ఆలయంలో భక్తుల దర్శనాన్ని నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ధ్వజారోహణం ఘట్టాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, అర్చకస్వాములు పాల్గొన్నారు.
పట్టువస్త్రాలు సమర్పణ
బ్రహ్మోత్సవాల మొదటిరోజైన ధ్వజారోహణం సందర్భంగా రాజంపేట ఎమ్మెల్యే, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడు శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి ఉదయం శ్రీ కోదండరామస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరఫున తిరిగి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులు తమ ఇంటి నుండి రాములవారి కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.