BRAHMOTSAVAMS IN VALMIKIPURAM FROM APRIL 15 TO 24 _ వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ సాలకట్ల బ్రహ్మోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ సాలకట్ల బ్రహ్మోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి, ఏప్రిల్ 12, 2013: వాల్మికి పురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 15వ తేది నుండి 24వ తేది వరకు జరగనున్న వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవముల పోస్టర్లను తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ.సుబ్రహ్మణ్యం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఇ.ఓ.మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి వాల్మికి మహర్షికి దివ్య దర్శన భాగ్యాన్ని కల్గించిన పవిత్ర క్షేత్రం అని చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాలలో పాల్గొని తరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటరామి రెడ్డి, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డమ్మ, ఎ.ఇ.ఓ. లక్ష్మణ్ నాయక్, సూపరింటెండెంట్ దినకర్ రాజు మరియు ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తేదీ ఉదయం రాత్రి
15-04-2013(సోమవారం) ధ్వజారోహణం గజవాహనం
16-04-2013(మంగళవారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం
17-04-2013(బుధవారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం
18-04-2013(గురువారం) సర్వభూపాలవాహనం శేషవాహనం
19-04-2013(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభవాహనం,
మోహినీ అవతారోత్సవం
20-04-2013(శనివారం) తిరుచ్చి ఉత్సవం కల్యాణోత్సవం, గరుడ వాహనం
21-04-2013(ఆదివారం) రథోత్సవం ధూళి ఉత్సవం
22-04-2013(సోమవారం) తిరుచ్చి ఉత్సవం అశ్వవాహనం, పార్వేట ఉత్సవం
23-04-2013(మంగళవారం) వసంతోత్సవం , హంస వాహనం,
చక్రస్నానం ధ్వజావరోహణం
24-04-2013(బుధవారం) స్నపన తిరుమంజనం పుష్పయాగం
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.