BRAHMOTSAVAMS POSTERS RELEASED _ హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు

Hyderabad / Tirupati, 07 February 2026: The annual Brahmotsavams of Sri Venkateswara Swamy Temple, Jubilee Hills, Hyderabad, will be conducted from February 17 to 25.

The TTD Chairman Sri B.R. Naidu unveiled the wall posters and invitation booklets on Saturday at the temple premises.

The Chairman later instructed the officials concerned to ensure smooth arrangements for devotees, including illumination, floral decorations, queue lines, drinking water, Annaprasadam, and security.

The Koil Alwar Tirumanjanam will be held on February 10, while Dhwajarohanam is on February 17 while Garuda Seva is on February 21. Daily Vahana Sevas during the Brahmotsavams will take place both in the morning and in the evening.

The cultural programmes and Annamacharya Sankeertanas are also arranged to enthrall devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు

హైదరాబాద్ / తిరుపతి, 2026, ఫిబ్రవరి 07: హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు గోడ పత్రికలను మరియు ఆహ్వాన పత్రికలను శనివారం జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అంచనా వేసి ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టాలని కోరారు. చలువ పందిళ్లు, క్యూ లైన్లు, తాగునీరు, అన్నప్రసాదాలు, పటిష్ట సెక్యూరిటీ  ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయ ఎల్.ఏ.సి ప్రెసిడెంట్ శ్రీ ఏ. వి. రెడ్డి, ఏఈవో శ్రీ రమేశ్, టెంపుల్ ఇన్పెక్టర్స్ శ్రీ నిరంజన్, శ్రీ హరికృష్ణ, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.  

ఫిబ్రవరి 10 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ఈ సందర్భంగా తెల్లవారుజామున వేకువ జూమున స్వామివారిని మేల్కొలిపి, అనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడుతారు.  ఉదయం 07.00 గం.ల నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 11 గం.ల నుండి సాయంత్రం 05.00 గం.ల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

17-02-2026

ఉదయం – ధ్వజారోహణం ( మేష లగ్నం –  ఉ. 10.30 – 11.00 గంటల వరకు)

రాత్రి – పెద్దశేష వాహనం

18-02-2026

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

19-02-2026

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

20-02-2026

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

21-02-2026

ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం (రాత్రి 07.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు)

22-02-2026

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

23-02-2026

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

24-02-2026

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

25-02-2026

ఉదయం – చక్రస్నానం(ఉ. 08.00 నుండి 10.00 గంటల వరకు)

రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)

26.02.2026.

మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం .

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.