BREAK DARSHAN TIME CHANGE FOR BENEFIT OF COMMON DEVOTEES- TTD CHAIRMAN _ సామాన్య భక్తుల సౌకర్యార్థమే బ్రేక్ దర్శన సమయం మార్పు : టిటిడి ధర్మకర్తల మండల అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirumala, 01 December 2022: TTD Chairman Sri YV Subba Reddy said on Thursday that the  Break Darshan timings have been changed with the objective of providing early Srivari Darshan for common devotees waiting overnight in the compartments.

Speaking to the media in front of Srivari temple the Chairman said from , December 01 onwards the VIP Break Darshan has been shifted to 8.00 am in the morning and almost 8000 common devotees had Srivari Darshan in the slot vacant in the morning between 6am and 7.30am.

He said the VIP Break Darshan timings have been altered on an experimental basis and the same will be reviewed after a month. The shifting of Break Darshan has provided two to three hours slot benefitting nearly 15,000 devotees.

Secondly, he said henceforth the break Darshan devotees could travel to Tirumala during the time for Darshan which will reduce pressure on accommodation at Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సామాన్య భక్తుల సౌకర్యార్థమే బ్రేక్ దర్శన సమయం మార్పు : టిటిడి ధర్మకర్తల మండల అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, 2022, డిసెంబరు 01: తిరుమల శ్రీవారి దర్శనం కోసం రాత్రి నుండి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసినట్లు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.

శ్రీవారి ఆలయం ఎదుట గురువారం ఉదయం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ గురువారం నుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు ప్రారంభించామన్నారు. మొదటిరోజు ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు దాదాపు 8,000 మంది సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు వివరించారు. ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేసి పరిశీలిస్తున్నామని ఒక నెల తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ మార్పు వల్ల ఉదయం 2 నుండి 3 గంటల సమయం లభిస్తుందని, దాదాపు 15,000 మంది సర్వదర్శనం భక్తులకు దర్శనం కల్పించవచ్చని తెలిపారు. బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి ఉదయం తిరుమలకు రావచ్చని, తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.