BTU OF SRI KAPILESWARA SWAMY TEMPLE FROM FEB 19 -28 _ ఫిబ్రవరి 19 నుండి 28వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 19 నుండి 28వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2025 ఫిబ్రవరి 06: తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 15న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ప్రతి రోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
19-02-2025
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – హంస వాహనం
20-02-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
21-02-2025
ఉదయం – భూత వాహనం
రాత్రి – సింహ వాహనం
22-02-2025
ఉదయం – మకర వాహనం
రాత్రి – శేష వాహనం
23-02-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – అధికారనంది వాహనం
24-02-2025
ఉదయం – వ్యాఘ్ర వాహనం
రాత్రి – గజ వాహనం
25-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – అశ్వ వాహనం
26-02-2025
ఉదయం – రథోత్సవం (భోగితేరు)
రాత్రి – నందివాహనం
27-02-2025
ఉదయం – పురుషామృగవాహనం
సాయంత్రం – కల్యాణోత్సవం,
రాత్రి – తిరుచ్చి ఉత్సవం
28-02-2025
ఉదయం – త్రిశూలస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం,
రాత్రి – రావణాసుర వాహనం
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది