BUGGA UTSAVAM BEGINS GRANDLY AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా బుగ్గోత్సవం
Tirupati, April 28, 2026: The three-day Bugga Utsavam commenced on a grand note at Sri Govindaraja Swamy Temple in Tirupati on Tuesday.
The rituals began with Suprabhatam followed by Viswaroopa Darshan. Later, the processional deities of Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi were taken to the Bugga.
Snapana Thirumanjanam, Samarpana and Asthanam were performed from 2:30 PM to 4:30 PM. In the evening, Unjal Seva and Asthanam were held at Sri Mahalakshmi Ammavari Mandapam, followed by a procession to the Bugga, offering darshan to devotees.
Superintendent Sri Chiranjeevi, Temple Inspector Sri Dhananjaya, officials, priests and a large number of devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా బుగ్గోత్సవం
తిరుపతి, 2026 ఏప్రిల్ 28: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం బుగ్గోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో మొదటిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని బుగ్గ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ మహలక్ష్మీ అమ్మవారి మండపంలో ఉభయనాంచారులతో కలసి శ్రీవారి ఊంజలసేవ, ఆస్థానం, అనంతరం బుగ్గ వద్ద ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




