CANCELLATION OF VIP BREAK DARSHANS DURING FESTIVALS IND DECEMBER AND JANUARY _ డిసెంబర్ నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు వివరాలు

Tirumala, 04 December 2025: The VIP break darshans have been cancelled in view of various festivals to be held at Tirumala in the months of December 2025 and January 2026.

VIP Break darshans stands cancelled on the following days: December 23: Koil Alwar Tirumanjanam,  December 29: a day before Vaikuntha Ekadasi, December 30 to January 8: During the 10-day Vaikuntha Dwara Darshanam  January 25: Radha Sapthami

Except for protocol VIP dignitaries, No recommendation letters for VIP Break darshans will be accepted on the previous days of the above-mentioned days. 

The devotees are therefore requested to make note of this and cooperate with TTD.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

డిసెంబర్ నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు వివరాలు

తిరుమల, 2025 డిసెంబర్ 04:: 2025 డిసెంబర్ నెల నుండి 2026  జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించు పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేయడం జరిగింది.

డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ, డిసెంబర్ 30వ తేది నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం జరిగింది.

పైన పేర్కొన్న రోజులకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది. 

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.