CHAIRMAN AND EO RELEASE BRAHMOTSAVAM BOOKLETS _ శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్
GRAND ARRANGEMENTS FOR TWIN BRAHMOTSAVAMS THIS YEAR- TTD CHAIRMAN
AP CM TO PRESENT SILK VASTRAMS ON SEP 18
ANNUAL BRAHMOTSAVAMS FROM SEPTEMBER 18-26
NAVARATRI BRAHMOTSAVAMS FROM OCTOBER 15-23
Tirumala, 30 August 2023: The TTD Chairman Sri Bhumana Karunakar Reddy along with the TTD EO Sri AV Dharma Reddy released the Brahmotsavam booklet in front of Tirumala temple on Wednesday.
Speaking to media on the occasion, the TTD Chairman said, the honourable CM of AP Sri YS Jaganmohan Reddy will offer silk vastrams to Srivaru on behalf of the State Government on the first day of the annual Brahmotsavam on September 18.
He said arrangements by all the departments of TTD are underway for the twin mega religious events which are scheduled in the months of September and October. “The annual brahmotsavams are scheduled between September 18 and 26 while the Navaratri Brahmotsavams between November 15 and 23. No recommendation letters for VIP Break Darshan will be accepted during both the Brahmotsavam festivities and every effort will be made to provide better Darshan of Srivaru and Vahana Sevas, rooms and Annaprasadam, laddus and security to common devotees”, he maintained.
TTD JEO Sri Veerabrahmam, the Chief Priests of Tirumala temple, Sri Venugopala Deekshitulu, Sri Krishnaseshachala Deekshitulu, DyEO Temple Sri Lokanatham and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్
తిరుమల, 2023 ఆగస్టు 30: శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి శ్రీవారి ఆలయం ఎదుట ఆవిష్కరించారు.
అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు శ్రీవైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరపున శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. సామాన్య భక్తులకు సంతృప్తికరంగా వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామన్నారు. బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు స్వీకరించబోమన్నారు. రెండు బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారని వివరించారు. ముఖ్యంగా సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి వాహన సేవలను దర్శించాలని ఈ సందర్భంగా ఛైర్మన్ కోరారు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.