CHAIRMAN CALLS ON AP CM _ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
TIRUPATI, 11 NOVEMBER 2024: TTD Chairman Sri BR Naidu has formally met the Honourable CM of AP Sri N Chanda Babu Naidu on Monday.
He handed over the flower bouquet to the AP CM at the later’s office in Sachivalayam at Velagapudi and conveyed his thanks.
The TTD Board Chief also met the Honourable DyCM of AP Sri Pavan Kalyan, Endowments Minister Sri Ramanarayana Reddy, Minister for Human Resources Development of AP Sri N Lokesh.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
తిరుమల, 2024 నవంబరు 11: ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా ప్రమాణం చేశాక తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేసి స్వామి వారి ప్రసాదాలు, పుష్పగుచ్చం అందించారు. భక్తులకు స్వామి వారి దర్శనం, అన్నప్రసాదాలు, వసతి సౌకర్యాలపై రాజీ లేకుండా సేవలు అందించాలని ముఖ్య మంత్రి టీటీడీ చైర్మన్ కు సూచించారు.
అలాగే ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కె.పవన్ కళ్యాణ్ , దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కలిసి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.