CHAIRMAN, EO INVITES GUV _ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి – రాష్ట్ర‌ గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్, ఈవో

TIRUMALA, 21 SEPTEMBER 2022: As the annual Brahmotsavams of Tirumala are scheduled between September 27 to October 5, TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri AV Dharma Reddy invited the Honourable Governor of Andhra Pradesh, Sri Biswabhushan Harichandan for the annual festival.

 

They formally met the first citizen of the State in Raj Bhavan, and presented him Theertha Prasadams, Sesha Vastram of Srivaru along with the Brahmotsavam invitation.

 

Sri RP Sisodia, Special Chief Secretary to the Governor at Raj Bhavan was also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి – రాష్ట్ర‌ గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్, ఈవో

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 21: సెప్టెంబ‌రు 24 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆహ్వానించారు.

రాజ్ భవన్‌లో బుధవారం వారు గవర్నర్ ను కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలను బహుకరించి, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను గ‌వ‌ర్న‌ర్‌కు అందించి బ్రహ్మోత్సవాల విశిష్టతను వివరించారు.

కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.