CHAIRMAN INSPECTS _ తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

Tirumala, 30 January 2025: The TTD Chairman Sri B.R. Naidu, along with board members, conducted surprise inspections in Tirumala on Tuesday evening.

He interacted with devotees in the Srivari temple premises, inquiring about the facilities and amenities, to which the devotees expressed immense satisfaction.

The Chairman and board members also witnessed the dance performances by artists on the Nadaneerajanam stage and the Sri Ranganathaswamy temple setting.

Board members Sri Jyothula Nehru, Smt Janaki Devi, Sri Naresh, Sri Shantaram participated in the inspection.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

తిరుమల, 2025 డిసెంబర్ 30: తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు మంగళవారం సాయంత్రం బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ నరేష్, శ్రీ శాంతా రామ్, శ్రీమతి జానకి దేవిలతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి చేసుకుని వెలుపలకు వచ్చిన భక్తులతో మాట్లాడి టీటీడీ కల్పించిన సౌకర్యాలు, సదుపాయాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా శ్రీవారి దర్శనం బ్రహ్మాండంగా జరిగిందని, టీటీడీ చేసిన ఏర్పాట్లు, అలంకరణలు అద్భుతంగా ఉన్నాయని చైర్మన్ వద్ద భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు నిరంతరాయంగా అందుతున్నాయని చైర్మన్ కు తెలిపారు. 

అనంతరం నాది నీరాజనం వేదికపై కళాకారుల నృత్య ప్రదర్శనలు, ఆలయం ముందు శ్రీరంగనాథ స్వామి ఆలయ సెట్టింగును తిలకించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.