CHAIRMAN INSPECTS COINS PARAKAMANI_ తిరుపతిలో నాణేల పరకామణిని తనిఖీ చేసిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పూట్టా సుధాకర్‌ యాదవ్‌

Tirupati, 10 August 2018: TTD Trust Board Chairman Putta Sudhakar Yadav on Friday evening inspected the coins parakamani (counting centre) located at TTD administrative building in Tirupati.

He instructed the officials concerned to clear the piled up Indian and foreign currency coins by negotiating with the banks. “During our last inspection I had instructed the officials concerned to see that there be no piling up of foreign currency. Recently we have deposited 2crores worth coins in banks. Another 2crores will be deposited soon”, he added.

FACAO Sri Balaji, VGO Sri Ashok Kumar Goud were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులు ఇచ్చిన నాణేలను త్వరితగతిన మార్పిడికి ఆదేశం – తిరుపతిలో నాణేల పరకామణిని తనిఖీ చేసిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పూట్టా సుధాకర్‌ యాదవ్‌

తిరుపతి, 2018 ఆగస్టు 10: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించిన నాణేలను వేగవంతంగా మార్పిడి చేయాలని టిటిడి ఛైర్మన్‌ శ్రీ పూట్టా సుధాకర్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని నాణేల పరకామణిని శుక్రవారం టిటిడి ఛైర్మన్‌ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలలోని నాణేలు పేరుకుపోకుండా లెక్కింపు పూర్తి చేసి బ్యాంకులలో డిపాజిట్‌ చేయాలన్నారు. విదేశీ, స్వదేశీ నాణేల విభజన, లెక్కింపును త్వరితంగా పూర్తిచేయాలన్నారు. గత పరిశీలన అనంతరం దాదాపు రూ.2 కోట్ల నాణేలను బ్యాంకులలో జమచేశామన్నారు. వారం రోజులలో మరో రూ.2 కోట్లు బ్యాంకులలో జమచేస్తామన్నారు. మిగిలిన నాణేలను వీలైనంత త్వరగా బ్యాంకులలో జమచేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కమిటీ సభ్యులు రిజర్వు బ్యాంక్‌ అధికారులతో చర్చిస్తారన్నారు.

అంతకుముందు ఆయన అధికారులతో కలిసి నాణేల పరకామణిని, ట్రేజరిని పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, విజివో శ్రీ అశోక్‌కుమార్‌గౌడ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.