CHAIRMAN PRESENTS VASTRAMS TO KANIPAKAM TEMPLE _ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి చైర్మెన్ పట్టువస్త్రాల సమర్పణ
TIRUPATI, 04 SEPTEMBER 2025: In a traditional practice, TTD Chairman Sri BR Naidu on behalf of TTD presented silk vastrams on Thursday evening to Sri Varasiddhi Vinayaka Swamy temple in Kanipakam on the occasion of ongoing annual brahmotsavams in this famous temple.
Earlier on his arrival, the TTD Trust Board Chief was received by the temple EO Sri Penchala Kishore. After the darshan of the presiding deity the Chairman was offered Vedasirvachanam and presented with prasadams.
Tirumala temple DyEO Sri Lokanatham was also present.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి చైర్మెన్ పట్టువస్త్రాల సమర్పణ
తిరుపతి, 2025, సెప్టెంబర్ 04: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టిటిడి తరఫున టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు.
కాణిపాకంలో గురువారం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం సందర్భంగా టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి చైర్మెన్ కు ఆలయ ఈవో శ్రీ పెంచెల కిషోర్ కుమార్, ఏఈవో శ్రీ రవీంద్ర బాబు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, బొక్కసం ఇంఛార్జి శ్రీ గురురాజ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.








