CHAIRMAN VISITS THE DECORATIONS _ ప్రత్యేక ఆకర్షణగా ఫల – పుష్ప ఆకృతులు
TIRUMALA, 02 APRIL 2022: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Saturday paved a visit to the colourful floral displays erected opposite Tirumala temple on the auspicious occasion of Telugu Ugadi.
Later speaking to media persons he said that he prayed Sri Venkateswara Swamy to bestow good health and prosperity to all especially the people of twin Telugu states in this new year.
DECORATIONS BY GARDEN WING ATTRACT DEVOTEES
Meanwhile, 150 florists worked for three days to make the colourful decorations inside as well outside Tirumala shrine for Telugu Ugadi under the supervision of TTD Garden Wing Deputy Director Sri Srinivasulu.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ప్రత్యేక ఆకర్షణగా ఫల – పుష్ప ఆకృతులు
తిరుమల, 2022 ఏప్రిల్ 02: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల ఆపిల్, ద్రాక్ష, బత్తయి, సపోటా, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం చెంత శ్రీలంక ఆర్ట్‌తో చేసిన అలంకరణలు, పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీపద్మావతి శ్రీనివాసుల కల్యాణ ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవధాన్యలతో చెసిన శ్రీమహావిష్ణువు, శ్రీరాముడి సెట్టింగ్‌లు భక్తులను ఆకర్షించాయి.
అదేవిధంగా ఆలయం బయట వివిధ రకాల పుష్పాలతో అశ్వాలు, త్రేత, ద్వాపర, కలియుగాలకు సంబంధించిన వివిధ సన్నివేశాల సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం బయట భక్తులు తమ చరవాణిలలో ఫలపుష్ప ఆకృతులతో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు.
టిటిడి గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీశ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు మూడు రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫల – పుష్ప ఆకృతులను రూపొందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.