CHAKRA SNANAM HELD _ వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం
TIRUPATI, 15 JUNE 2025: The ongoing annual brahmotsavams at Appalayagunta has reached the final day on Sunday.
The Utsava deities were offered Snapana Tirumanjanam between 9:15am and 10:30am in the morning. Later the Chakra Snana Mahotsavam was observed with utmost relgious fervor.
DyEO Sri Harindranath, temple officials, devotees and Sevaks were present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం
తిరుపతి, 2025 జూన్ 15: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం చేపట్టారు. తదుపరి 9.15 – 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 – 10.45 గం.ల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు నవసంధి, మాడవీధి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలోటిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.