CHANDI YAGAM CONCLUDES _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రీయంగా ముగిసిన చండీ యాగం

Tirupati, 07 November 2025: As a part of month long Karthika masa Homotsavams, Sri Chandi Yagam concluded in Sri Kapileswara Swamy temple in Tirupati on Friday.

From November 08 till 18, Rudra Homam will be observed.

Temple officials, priests and devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రీయంగా ముగిసిన చండీయాగం

తిరుపతి, 2025, నవంబర్ 07: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీ యాగం) శుక్రవారం వైభవంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 30 నుండి నవంబర్ 07వ తేదీ వరకు చండీయాగం నిర్వహించారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు చండీ యాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు కలశాభిషేకం, అలంకరణ, నివేదన మరియు హారతి నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి కలశస్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె.పి. చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నవంబరు 08 నుండి రుద్ర హోమం

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 08 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్ర హోమం ) జరుగనుంది.

గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.