“CHANDRA SAHODARI” GRACES ON CHANDRAPRABHA _ చంద్రప్రభ వాహనంపై ధనలక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు
Tiruchanoor, 17 Nov. 20: On the seventh day evening as part of ongoing annual Karthika Brahmotsavams, Goddess Padmavathi as Dhana Lakshmi graced on Chandraprabha Vahana.
According to legends, both Chandra and Lakshmi Devi emerged during the churning of milk ocean and hence revered as siblings. Both are known for their beauty, charm and grace. The very sight of the moon gives a soothing feel.
Similarly, the devotees who witnessed the Chandraprabha Vahana Seva were chill thrilled by the sight of beautiful Dhana Lakshmi on charming Chandraprabha Vahanam.
Both the Jiyar Swamis of Tirumala, EO Dr KS Jawahar Reddy, JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, DyEO Smt Jhansi Rani and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
చంద్రప్రభ వాహనంపై ధనలక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుపతి, 2020 నవంబరు 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు, జెఈవో శ్రీ పి.బపంత్‌కుమార్ దంపతులు, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి , సిఇ శ్రీ రమేష్‌రెడ్డి , విఎస్వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాసులు, అలంకార భట్టార్ శ్రీ ఎం.జి.రామచంద్రన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
నవంబరు 19న పంచమీ తీర్థం :
నవంబరు 19వ తేదీ గురువారం పంచమీ తీర్థం(చక్రస్నానం) సందర్భంగా ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 10 నుండి మధాహ్నం 12.00 గంటల వరకు ఏకాంతంగా నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.