CHANDRAGIRI MLA AND TTD EX-OFFICIO MEMBER OFFERS SILKS TO KALYANA VENKATESWARA _ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
Tirupati, 24 Feb. 22: As a traditional practice, the Chandragiri legislator, TUDA Chief, and the TTD Ex-officio member Dr.C Bhaskar Reddy offered Pattu Vastrams to Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on the auspicious occasion of Garuda Seva on Thursday evening.
On his arrival, he was received by TTD JEO Sri Veerabrahmam. These vastrams will be adorned to Sri Kalyana Venkateswara for the Garuda Seva.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతి, 2022 ఫిబ్రవరి 24: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే, తుడ ఛైర్మన్ డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు గురువారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న డా. భాస్కర్‌రెడ్డికి టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనం సందర్భంగా తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తుమ్మలగుంట నుంచి శ్రీనివాస మంగాపురంకు పాదయాత్రగా వచ్చి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎం.పి.పి. శ్రీ హేమేంద్ర కుమార్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
రెండు గొడుగులు విరాళం :
తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్రతినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అందించారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనం రోజున ఈ ట్రస్టు తరఫున గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.