CHANDRAPRABHA VAHANAM OF SRI KODANDARAMA SWAMY DAZZLES IN DIVINE SPLENDOR _ దివ్య కాంతుల్లో అలరించిన కోదండరాముడి చంద్రప్రభ విహారం

Tirupati, March 23, 2026: As part of the annual Brahmotsavams of Sri Kodandarama Swamy in Tirupati, the Lord blessed devotees on Monday, the seventh day, at 7 PM, riding the Chandraprabha Vahanam.

The Vahana Seva was conducted grandly along the four Mada streets surrounding the temple. Devotees offered camphor harati at every step and had the divine darshan of the Lord.

The sight of the Lord on the Chandraprabha Vahanam filled the hearts of devotees with immense joy. It is believed to relieve the three types of afflictions — spiritual (Adhyatmika), physical (Adhibhautika), and divine (Adhidaivika).

Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy, Temple Deputy Executive Officer Smt. Nagaratna, Temple Inspector Sri Suresh, priests, and a large number of devotees participated in the Vahana Seva.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దివ్య కాంతుల్లో అలరించిన కోదండరాముడి చంద్రప్రభ విహారం

తిరుపతి, 2026 మార్చి 23: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను నివారిస్తుంది.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.