CHANGE IN DATE OF ISSUING TOKENS _ స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం : టిటిడి
SRIVARI DARSHAN FOR LOCALS ON DECEMBER 03
Tirumala, 30 November 2024: The locals will be provided Srivari Darshan on December 03 in Tirumala.
Tokens will be issued on December 02 at Mahathi Auditorium in Tirupati and in the Community Hall of Tirumala at 5 am instead of December 01 as announced by TTD earlier following inclement weather.
The TTD Board of Trustees in its first meeting held on November 18 decided to provide Srivari darshan to locals on the first Tuesday of every month.
To this end, TTD is making arrangements to provide darshan to the locals on December 03 (first Tuesday).
The local residents of Tirupati Urban, Tirupati Rural, Chandragiri, Renigunta mandals as well as Tirumala are requested to make note of the change in date and shall get the tokens by showing their original Aadhaar card in the above-stated centers in Tirupati and Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం : టిటిడి
వర్షాల కారణంగా దర్శన టోకెన్లు మంజూరు చేసే తేదీలో మార్పు
తిరుమల,2024 నవంబరు 30: డిసెంబర్ 2న తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ
టిటిడి ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ముందుగా డిసెంబర్ 1న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లును జారీ చేయనున్నట్లు ప్రకటించినా, నిరంతరాయ వర్షాల కారణంగా ఈ తేదీని డిసెంబర్ 2 కు మార్పు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది.
ఈ మేరకు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి సదరు కేంద్రాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టోకెన్లు పొందవచ్చని టిటిడి తెలియజేయడమైనది
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.