CHANGE IN VIP BREAK DARSHANS ON TRIAL BASIS FROM MAY 01 _ మే 01 నుండి పరిశీలనాత్మకంగా వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు

VIP BREAK DARSHAN LIMITED TO ONLY PROTOCOL VIPS (SELF) FROM MAY 01 TO JULY 15

-TTD KEY DECISIONS

Tirumala, 27 April 2025: With the advent of summer vacation rush which has already commenced in Tirumala, TTD is set to implement several key decisions from May 01 onwards.

As a part of giving priority to the common devotees coming for Srivari Darshan during the peak summer vacation, TTD has restricted the VIP break darshan only to protocol VIPs (Self) who come for Srivari Darshan from May 01 to July 15.

Similarly, from May 01 onwards, on an experimental basis, the VIP break darshans will be implemented at 6 am for the self protocol VIPs who come for the Darshan of Sri Venkateswara Swamy.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే 01 నుండి పరిశీలనాత్మకంగా వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు

తిరుమల, 2025 ఏప్రిల్ 27: వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 01 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం

-టిటిడి కీలక నిర్ణయాలు

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టిటిడి మే 01 తారీకు నుండి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది.

వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా మే 01 తారీకు నుండి జూలై 15 వ తారీకు వరకు, వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనుంది.

అదేవిధంగా మే 01 తారీకు నుండి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుండి అమలు చేయనుంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి చే జారీ చేయబడింది