CHANTING VEDA MANTRAS IS REMEDY FOR ALL ILLNESS _ వేద శ‌బ్ధం స‌ర్వ‌రోగ నివార‌ణం – రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌

Tirumala, 18 Mar. 20: Chanting and listening to Vedic hymns is a sure cure to all ailments and diseases asserted Vice Chancellor of Rastriya Sanskrit Vidya Peetham.

Addressing on the occasion of Veda Mantra Japa Yagnam programme at Asthana Mandapam on Wednesday evening he said, Vedas are the divine scriptures and the vedic sounds itself cures all diseases, he maintained.

He said the Vedic pundits in the Japam are reciting the Arogya Mantras from Rig, Yajur, Sama, Adharvana Vedas are being recited.

Higher Vedic Studies Special Officer Dr Vibhishana Sharma and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

వేద శ‌బ్ధం స‌ర్వ‌రోగ నివార‌ణం – రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌

తిరుమల, 2020 మార్చి 18: వేదాలు భ‌గ‌వంతుని స్వ‌రూపాల‌ని, వేద శ‌బ్ధ‌ త‌రంగాల‌తో ఎలాంటి రోగాలైన న‌య‌మ‌వుతాయ‌ని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌ తెలిపారు. తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞంలో భాగంగా 3వ రోజైన బుధ‌వారం సాయంత్రం  ఆయ‌న‌ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వేదాల నుండి అన్ని మంత్రాలు ఉద్భ‌వించాయ‌న్నారు.  వేదం అంటే విజ్ఞానం అని, ప్ర‌పంచం ఎలా ఉండాలో చెప్పే శ‌క్తి వేదాల‌కు ఉంద‌న్నారు. రాబోవు కాలంలో శ‌బ్ధ శ‌క్తి నుండి వెలువ‌డే త‌రంగాల వ‌ల‌న అన్ని రోగాలు నివారింపబ‌డ‌తాయ‌ని తెలిపారు. వేద పండితులు రుగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలో ఆరోగ్యానికి సంబంధించిన మంత్రాలు, మాన‌సిక అందోళ‌న‌లు తొల‌గించే మంత్రాల‌ను ప‌ఠించ‌డం వ‌ల‌న విశ్వంలోని ప్రాణ‌కోటికి హానిక‌లిగించేవి న‌శిస్తాయ‌ని వివ‌రించారు. అదేవిధంగా రాబోవు వ‌సంత ఋతువు నేప‌థ్యంలో జీవులంద‌రికి తాప‌త్రాయాలు తొల‌గి స‌ర్వ‌తో ముఖాభివృద్ధికి వేద‌పారాయ‌ణం, జ‌పం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, శ్రీ‌నివాస క‌ల్యాణం ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ స‌త్య‌గోపాల్, క‌ర్ణాట‌క రాష్ట్ర టిటిడి వేద‌పారాయ‌ణ ప‌ర్య‌వేక్ష‌కులు బ్ర‌హ్మ‌శ్రీ హ‌రి వీరభ‌ద్ర ఘ‌ణ‌పాటి, ఆంధ్ర‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన 30 మంది వేద పండితులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.