CHENNAI UMBRELLAS REACH TIRUMALA _ తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు
Tirumala, 21 September 2023: Chennai umbrellas presented by the Hindu Dharmarta Samiti for decorating the Garuda Vahana procession during the Srivari Brahmotsavam on September 22, reached Tirumala on Thursday morning.
The Samiti trustee Sri RR Gopalji who accompanied the umbrellas presented them to TTD EO Sri AV Dharma Reddy in front of the Srivari Temple.
The umbrellas were paraded on the Mada streets ahead of being taken inside the temple for decorating them during Garuda Vahana.
Speaking on the occasion Sri Gopalji said that all 11 umbrellas were brought from Chennai and the procession began on September 16 after special pujas at Sri Chennakeshava Perumal temple of which 2 umbrellas were presented to Sri Padmavati Ammavaru temple in Tiruchanoor on Wednesday.
The umbrellas are being presented to Tirumala since 19 years for decorating during the Garuda Vahana.
DyEO of Srivari temple Sri Lokanathan and other officials were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2023 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు
తిరుమల, 2023 సెప్టెంబరు 21: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులను ఊరేగింపుగా గురువారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.
ఈ సందర్భంగా శ్రీ ఆర్.ఆర్.గోపాల్‌జి మాట్లాడుతూ ఈనెల 16న చెన్నై నుంచి 11 గొడుగుల ఊరేగింపు ప్రారంభమైందన్నారు. చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. సెప్టెంబరు 20న బుధవారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి 2 గొడుగులను సమర్పించినట్టు చెప్పారు. గత 19 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి గరుడ సేవ నాడు అలంకరించడానికి శ్రీవారికి గొడుగులు సమర్పిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.