CHINNA SESHA, GARUDA, HANUMANTHA VAHANAMS ENTRALL DEVOTEES _ ⁠ ⁠చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై శ్రీ మలయప్ప అభయం

TIRUMALA TIRUPATI DEVASTHANAMS

CHINNA SESHA, GARUDA, HANUMANTHA VAHANAMS ENTRALL DEVOTEES

CHAKRASNANAM OBSERVED

Tirumala, 16 February 2024: The Sapta Vahana seva which began with Suryaprabha also witnessed Sri Malayappa taking a solo ride on Chinna Sesha, Garuda and Hanumanta Vahanams in the first half of the day on Friday.

CHINNA SESHA VAHANAM (9am to 10am)

According to mythology, Chinna Sesha is considered as Vasuki.  According to Sri Vaishnava tradition, God is Seshi and the world is Seshabhuta.  Sesavahanam represents this relic.  Devotees strongly believe that they will be blessed with Kundalini Yoga if they witness Him on this carrier.

GARUDA VAHANAM (11 am to 12 noon)

Garuda Vahanam is the vehicle most loved by Srivaru.  In the mythological context, Garudaseva has become very important in all 108 Vaishnava Divya Desams.  Through Garudavahanam, Swami informs the devotees who measure themselves with Dasya Bhakti. 

HANUMANTHA VAHANAM (1pm to pm)

Seshachaladhisa appears to the devotees in procession on His most humble and noble devotee Hanuman.  Hanuman is the foremost among the devotees of Almighty for his benevolent qualities.  Lord as Sri Rama disciples, Hanuman, are great blessed His devotees on Hanumanta Vahana, the fourth one among the Vahanam series.

CHAKRASNANAM (2 to 3 pm)

Chakrasnanam was performed at Swami Pushkarini located near Sri Bhuvarahaswamy temple.  On this occasion, priests offered a special bath to the Chakratalwar with milk, curd, ghee, honey and sandalwood paste before giving holy dip.

Devotees cherished all Vahana sevas and also had holy dip during Chakra Snanam.

Later they all geared up for vahana sevas lined up in the second half of the day.                                        

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా చక్రస్నానం

•⁠ ⁠చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై శ్రీ మలయప్ప అభయం

తిరుమల, 2024, ఫిబ్ర‌వ‌రి 16: సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారంనాడు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. మధ్యాహ్నం స్వామి పుష్కరిణిలో చక్రస్నానం వేడుకగా జరిగింది. అంతకుముందు ఉదయం చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

 మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీవరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడయ్యాడు. అధికారులు, భక్తులు పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించారు.

చిన్నశేషవాహనం(ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు)

 పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

గ‌రుడ వాహనం(ఉదయం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు)

 శ్రీ‌వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌ది గ‌రుడ వాహ‌నం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.

హనుమంత వాహనం(మ‌ధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వ‌ర‌కు)

 శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్పీ శ్రీమతి మలికా గార్గ్ ఇతర అధికారులు వాహన సేవలో పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.