CJ OF AP HIGH COURT IN TIRUMALA _ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

Tirumala, 20 Oct 20: The Chief Justice of AP High Court Justice Sri Jitendra Kumar Maheswari on Tuesday night had darshan and blessings of Sri LordVenkateswara Swamy .

He was received by the TTD EO Sri KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy  and took them for Srivari Darshan and had blessings.Thereafter the Chief Justice also participated in the Garuda vahana seva held inside Srivari temple  as part of  ongoing Srivari Navaratri Brahmotsavam.

District Judge Sri Ravindra Babu and others were present .

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

తిరుమ‌ల‌, 2020 అక్టోబరు 20: రాష్ట్ర‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జితేంద్ర‌కుమార్ మహేశ్వ‌రి మంగ‌ళ‌వారం రాత్రి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్ద టిటిడి ఈవో శ్రీ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి క‌లిసి స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా జ‌రిగిన గ‌రుడ‌సేవ‌లో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా జ‌డ్జి శ్రీ ర‌వీంద్ర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.