CJ OF AP OFFERED PRAYERS IN TIRUMALA _ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

Tirumala, 21 Oct. 20: The Chief Justice of AP High Court justice Sri Jitendra Kumar Maheswari on Wednesday morning had darshan and blessings of Sri Venkateswara.

He was received by the TTD EO KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy and took them for Srivari Darshan and blessings.

Thereafter TTD Veda pundits at Ranganayakula Mandapams rendered the Chief Justice Veda ashirvachanam. The TTD EO Dr KS Jawahar Reddy presented thirtha Prasadam and portrait of Sri Venkateshwara.

District Judge Sri Ravindra Babu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

తిరుమ‌ల‌, 2020 అక్టోబరు 21: రాష్ట్ర‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జితేంద్ర‌కుమార్ మహేశ్వ‌రి బుధ‌వారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్ద టిటిడి ఈవో శ్రీ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి క‌లిసి స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నానంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేదపండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఆ త‌రువాత ఈవో శ్రీ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు, చిత్రప‌టాన్ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా జ‌డ్జి శ్రీ ర‌వీంద్ర‌బాబు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.