CJI OFFERS PRAYERS AT TIRUCHANOOR _ తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్న గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
Tirupati, 05 April 2025: The Honourable Chief Justice of India Justice Sanjiv Khanna, during his maiden visit to Tiruchanoor, offered prayers in Sri Padmavati Ammavari temple.
He was welcomed by TTD EO Sri J Syamala Rao on his arrival to the temple.
Later, the CJI offered prayers to the presiding deity and was offered with Thirtha Prasadams after Vedasirvachanam by Vedic Pundits.
Later, he reached Sri Padmavati Rest House in Tirumala where he was accorded warm welcome by the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary.
The CJI will offer prayers in the Tirumala temple on Sunday.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్న గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి , 2025, ఏప్రిల్ 05: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శనివారం సాయంత్రం దర్శించుకున్నారు.
శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికి టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం సీజేఐ వారికి టిటిడి ఈవో తీర్థప్రసాదాలను అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తిరుమల చేరిన గౌరవ సీజేఐ
శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానంతరం తిరుమల చేరుకున్న సీజేఐ గారికి శ్రీ పద్మావతీ అతిథి గృహం వద్ద టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు.
గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.