CJI OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా

Tirumala, 06 April 2025: The Honourable Chief Justice of India, Justice Sanjiv Khanna offered prayers to Sri Venkateswara Swamy during his maiden visit to Tirumala temple on Sunday.

TTD EO Sri J Syamala Rao and Additional EO Sri Ch Venkaiah Chowdary welcomed the CJI at Mahadwaram. He was offered traditional Isthikapal welcome by temple priests amidst chanting of veda mantras and led to the temple.

After the darshan, the Chief Justice of India was offered Sesha Vastram and later Vedaseervachanam at the Ranganayakula Mandapam. 

TTD EO presented the Theertha Prasadams and lamination photo of Srivaru to the protocol dignitary.

CVSO Incharge Sri Harshavardhan Raju was also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా

తిరుమల, 2025 ఏప్రిల్ 06: మొదటిసారిగా తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాల మధ్య వేద మంత్రాలు నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా ఇష్థికఫాల్ స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనం తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి ని అర్చకులు శేష వస్త్రం కప్పిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందజేశారు.

అటు తరువాత టీటీడీ ఈవో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్ ఛార్జ్ సీవీఎస్వో శ్రీ హర్షవర్ధన్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.