CJI REACHES TIRUMALA-LAUDS TTD PRODUCTS _ తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
Tirumala, 5 March 2022: The Honourable CJI Justice NV Ramana has reached Sri Padmavathi Rest House in Tirumala on Saturday evening.
He was welcomed by TTD Trust Board Chairman Sri YV Subba Reddy, Local Legislator Sri B Karunakar Reddy, EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Gopinath Jatti.
The CJI also had a view of all Panchagavya and Dry Flower Technology products put for display.
He lauded the innovative idea of technology.
Earlier the CJI also visited Saptha Go Pradakshinasala and offered Go Tulabharam and prayers to Sri Venugopala Swamy.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
తిరుమల, 2022 మార్చి 05: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.
శ్రీ పద్మావతి అతిథి గృహాల వద్ద ఆయనకు టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి,ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ శ్రీ పద్మావతి అతిథి గృహంలో టిటిడి ఏర్పాటు చేసిన 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు,
టిటిడి, వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం డ్రై ఫ్లవర్ టెక్నాలజితో ఆకర్షణీయంగా తయారుచేసిన శ్రీవారి ఫోటోలు, కీ చైన్లు, పేపర్ వెయిట్లతో ఏర్పాటు చేసిన స్టాల్ పరిశీలించారు. అంతకు ముందు జస్టిస్ ఎన్వీ రమణ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాలను సందర్శించారు.వేణుగోపాల స్వామి సేవలో పాల్గొని గో తులాభారం చెల్లించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.