CLASSICAL VOCAL AND DANCE BEATS MUSE DEVOTEES _ “పరాత్పర పరమేశ్వర……, కపిల మహాముని పూజిత లింగం….., హిమగిరి మందిర “
TIRUPATI, 10 FEBRUARY 2026: The melodious notes and classical dance beats enthralled devotees during the devotional cultural fete performed at Kapila Theertham as a part of annual brahmotsavams on Tuesday evening.
The devotees who witnessed these cultural programmes were drowned in devotional waves.
The entire premises reverberated to the divine chants of Sambho Siva Sambo… Harahara Maha Deva.. Sambho Sankara.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
“పరాత్పర పరమేశ్వర……, కపిల మహాముని పూజిత లింగం….., హిమగిరి మందిర “
సంకీర్తనలతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుపతి, 2026 ఫిబ్రవరి 10: శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇందులో భాగంగా సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు నాదస్వర అధ్యాపకులు శ్రీ హరిబాబు శ్రీ వేణుగోపాల్ బృందం, డోలుపై శ్రీ శ్రీనివాసులు, శ్రీ మనోజ్ , శ్రీ గిరిధర్, శృతిపై శ్రీసుమంత్ , తాళంపై శ్రీ లోకేష్ బృందం నాదస్వర డోలు కచేరి భక్తులను ఆకట్టుకుంది. కచేరీలో భాగంగా “గిరిజారమణ….., నిన్ను చెప్ప కారణమేమి…., వాంఛతోనున…., రాగసుధారస…., సదానంద తాండవం….., విశ్వేశ్వర….., భో శంభో….., “అను కృతులు ఆలపించిరి.
తరువాత సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:30 గంటల వరకు జరిగిన గాత్ర కచేరీలో గాత్రంపై కళాశాల శ్రీ శబరి గిరీష్, వయొలిన్‌పై డా|| కృష్ణ , మృదంగంపై శ్రీ రఘురామ్ బృందం అద్భుతంగా పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కచేరీలో భాగంగా “మహాగణపతిం…, పార్వతి పతిం…., శ్రీ కాళహస్తీశ…., పరాత్పర పరమేశ్వర……, కపిల మహాముని పూజిత లింగం….., హిమగిరి మందిర…., “వంటికృతులు పాడి ప్రేక్షకులను అలరించారు,
అనంతరం రాత్రి 7:30 నుంచి 8:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ హరినాథ్ బృందం “ఇందరికీ అభయములు……, లింగాష్టకం….., అంబాస్టకం….., కురై ఒండ్రుం ఇళ్ళై……, కాల భైరవాస్టకం….., వచ్చెను అలమేలు మంగా……. “వంటి అంశాలతో అందరిని ఆకట్టుకున్నారు. భరతనాట్య నృత్య కార్యకమంలో ఎం.పద్మ,హేమ చంద్రిక, తేజశ్రీ రమేష్, క్యాతిశ్రీ, తోరణ, తేజశ్రీ, పద్మజ, హర్షిత, భావన, రమ్యశ్రీ, శాన్వి, కీర్తన, జాహ్నవి, హవేష, లక్ష్మీ నిఖిల, జోష్నా, యశస్విని, తేజశ్రీ, నిత్యశ్రీ, అమర నాగ విందా, మౌలిక, హర్షిత, నేహా, అవంతిక, లోకారాధ్య, మహిత, జోషిత, మౌనిశ్రీ, రాహిత్య, లక్ష్మీ దీక్షిత పాల్గొన్నారు.








