CM RELEASED 2025 TTD CALENDARS AND DIARIES _ 2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు

TIRUMALA, 04 OCTOBER 2024: The Honourable CM of AP Sri N Chandrababu Naidu released the TTD diaries and calendars for the year 2025 at Ranganayakula Mandapam on Friday evening.

It included 12 sheet calendars -13.50 lakhs, big diaries – 8.25 lakh, small diaries – 1.50 lakhs, tabletop calendars – 1.25 lakhs, Srivari big calendars 3.50 lakhs, Ammavari big calendars -10 thousand, Srivaru-Padmavati Ammavaru calendars – 4 lakhs, Telugu Panchangam – 2.50 lakh copies, 6-sheet Calendars -50,000

Endowments Minister Sri Ramnarayana Reddy, EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary and other dignitaries, TTD officials and others were also present.

All these calendars and diaries will be made available in all TTD book stalls located in Tirumala and Tirupati initially and later in the outside places for the sake of devotees soon.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు

తిరుమల, 2024 అక్టోబ‌రు 04: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజైన శుక్ర‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.

12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.25 ల‌క్ష‌లు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు- శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 3 లక్షలు, 6 షిట్ క్యాలెండ‌ర్లు 50 వేలు, టీటీడీ స్థానిక ఆల‌యాలు 10 వేలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది.

రాష్ట్ర దేవదాయ శాఖ అమాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్రీ జయ శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, ఇతర ప్రముఖులు అధికారులు పాల్గొన్నారు.

కాగా 2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు అక్టోబరు 5వ తేదీ నుండి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుండి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది