CMs OF AP AND KARNATAKA PARTICIPATE IN SUNDARAKANDA PATHANAM _ సుందరకాండ పారాయణంలో పాల్గొన్న ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు
Tirumala, 24 Sep. 20: On the 106th day of Sundarakanda Pathanam, both the Chief Ministers of Andhra Pradesh and Karnataka states, Sri YS Jaganmohan Reddy and Sri BS Yediyurappa participated at Nadaneerajanam Mandapam at Tirumala on Thursday morning.
The Principal of Dharmagiri Veda Vignana Peetham Sri Kuppa Siva Subrahmanya Avadhani rendered Shlokas while narrated by Sri Venkateswara Higher Vedic Studies Project Officer Dr Akella Vibhishana Sharma.
The Annamacharya Project artists led by Dr Gurazada Madhushudhana Sharma rendered the famous Annamacharya Kriti, “Tandanana Ahi.. Tandanana Pure…” at the beginning of the programme and concluded with Hanuman Bhajan.
Among the prominent persons who participated in the programme includes Deputy CM Sri Narayana Swamy, Ministers Sri P Ramachandra Reddy, Sri Vellampalli Srinivasa Rao, Sri Venugopala Krishna,Alla Nani, Kodali Nani, MPs Sri Mithun Reddy, Sri Vemireddi Pratap Reddy, Tirupati MLA Sri B Karunakara Reddy, Smt RK Roja and a galaxy of public representatives. Among those from Karanataka, Minister Sri Srinivasa Poojari, Commissioner Smt Rohini Singhuri were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమల, 2020 సెప్టెంబరు 24: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌ|| శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, గౌ|| శ్రీ బి.ఎస్.యడ్యూరప్ప గురువారం ఉదయం శ్రీవారి దర్శనానంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.
కరోనా మహమ్మారి నుండి మానవాళిని రక్షించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ 168 రోజులుగా నాదనీరాజనం వేదికపై టిటిడి పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సుందరకాండ పారాయణం గురువారం నాటికి 106వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని, పండితులు డా. ఆకెళ్ల విభీషణశర్మ కలిసి శ్లోక పారాయణం చేసి వాటి విశిష్టతను వివరించారు. ముందుగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ గురజాడ మధుసూదనరావు బృందం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన బ్రహ్మమొక్కటే… సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చివరగా శ్రీహనుమా.. జయహనుమా .. అనే సంకీర్తనను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ నారాయణస్వామి, శ్రీ ఆళ్ల నాని, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీమతి మేకతోటి సుచరిత, శ్రీ వేణుగోపాలకృష్ణ, శ్రీ కొడాలి నాని, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎపిఐఐసి ఛైర్మన్ శ్రీమతి ఆర్‌కె.రోజా, ఎంపిలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శ్రీ మిథున్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ కరుణాకర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ ఎ.రమేష్‌రెడ్డి పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.