COFFEE TABLE BOOK TITLED, “TIRUMALA-KALIYUGA VAIKUNTHAM” RELEASED_ శ్రీ‌వారి ఆల‌యంలో కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించిన టిటిడి ఛైర్మ‌న్‌

Tirumala, 13 Apr. 21: A series of spiritual books released on the auspicious day of Plavanama Samvatsara Telugu Ugadi on Tuesday in Tirumala.

TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy released these books at Ranganayakula Mandapam.

Speaking on the occasion they said the Coffee Table book gives a broad view of Tirumala temple and TTD activities while the five other spiritual books written by Vedic exponents about the importance of Vaikhanasa Agama and their respective subjects.

Later they felicitated all the authors. JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, PRO Dr T Ravi were also present.

TTD brought out a Coffee Table Book titled, “Tirumala-Kaliyuga Vaikuntham” consisting a kaleidoscope of interesting legends of the presiding deity of Tirumala temple, the art and architecture of the shrine, unique administrative style of TTD and amenities provided to scores of pilgrims presented along with a compilation of vibrant photos penned by Smt and Sri Ramanam couple from Sri Rangapattinam.

The authors expressed immense pleasure over the release of the book and described as a token to Srinivasa from Sri Ranganatha.

Besides, five books including Vaikhanasa Mahima Manjari, Uttama Brahma Vidya Sara, Sri Vaikhanasopakhyanam, Trisati, and Dhyana Mukthavali of TTD publications were also released on the occasion.

Scholars Dr Vedantam Vishnubhattacharyulu, Sri Srinivasulu, Publications Spl. Officer Sri Ramaraju, Sub Editor Sri Narasimhacharyulu were also present.                                                                   

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించిన టిటిడి ఛైర్మ‌న్‌

తిరుమల, 2021 ఏప్రిల్ 13: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం ఉగాది ఆస్థానం అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌‌హ‌ర్‌రెడ్డితో క‌లిసి ‌టిటిడి కాఫీ టేబుల్ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్బంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ తెలుగు ప్ర‌జ‌లంద‌రికి శ్రీ ఫ్ల‌వ‌నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో ప్ర‌జ‌లంద‌రు ఆయురారోగ్యాల‌తో సుఖ‌సంతోషాల‌తో ఉండా‌ల‌న్నారు.

తిరుమల క్షేత్ర ప్రా‌శ‌స్త్యాన్ని తెలియజేసే పురాణ‌ ఇతిహాస‌, చారిత్ర‌క శాస‌న ఆధారాల‌తో “తిరుమల – కలియుగ వైకుంఠం” అనే పేరుతో టిటిడి కాఫీ టేబుల్ బుక్ రూపొందించింద‌న్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయ‌ నిర్మాణ వైశిష్ట్యం, శిల్ప‌క‌ళా నైపుణ్యం, అద్భుతమైన ఫొటోలతో శ్రీనివాస కళ్యాణ వైభ‌వం కళ్ళకు కట్టినట్లు చూపించబడింద‌ని తెలిపారు. తిరుమ‌ల గిరుల స‌హ‌జ‌శిలా సంప‌ద‌, తీర్థాలు, ప‌శుపక్ష్యాదులు, జంతువులు, అరుదైన వృక్ష సంపదకు నిల‌య‌మైన శేషా‌చ‌ల శ్రేణుల సౌంద‌ర్యం చక్కగా చూపించార‌న్నారు.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ప్రత్యేకమైన పరిపాలనా శైలి, అసంఖ్యాక యాత్రికులకు అందించే సదుపాయాలు, సేవల వంటి అంశాలు ఈ పుస్తకంలో పొందుప‌ర్చార‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యంలో జరిగే ఉత్స‌వాలు, ఆధ్యాత్మిక, సేవా కార్య‌క్ర‌మాలు చక్కటి ఫొటోలతో అత్య‌ద్భుతంగా చూపించారని ఆయ‌న తెలిపారు. శ్రీ‌వారి వైభ‌వాన్ని వివరించేలా రూపొందించిన ఈ పుస్తకం లోని ప్ర‌తి విష‌యం భక్తుల‌కు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంద‌ని వివ‌రించారు. ఈ పుస్తకాన్ని ఇంత అందంగా, ఆకర్షణీయంగా తయారుచేసిన శ్రీ రమనన్ దంపతులకు స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున‌ట్లు తెలిపారు.

అనంత‌రం ఈవో మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరాది అయిన శ్రీ ప్ల‌వ‌నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఉదయం 7 నుండి 9 గంటల నడుమ ఉగాది ఆస్థానం ఆగమోక్తంగా నిర్వహించార‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్ రెడ్డి, శ్రీ ముర‌ళికృష్ణ‌, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, డా.నిశ్చిత, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి , ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.