COLOURFUL PERFORMANCES DURING MOHINI AVATARAM _ పల్లకీ ఉత్సవంలో సాంస్కృతిక వైభవం
NATUA, GARBHA, BAREDI STEAL THE SHOW
Tirumala, 22 September 2023: Talents showcased by various artists hailing from different states across the country during the procession of Mohini Avataram on the fifth day morning of the ongoing annual brahmotsavams in Tirumala on Friday.
The devotees who thronged the four mada streets were mused to see the charm of divine enchantress Mohini on a finely decked palanquin along with Sei Krishna Swamy on another Pallaki.
Enhancing the beauty, the art forms mused devotees during the sacred parade.
The artists hailing from respective states presented their traditional art forms which included Gujrati Garbha, Maharastra Drums, Baredi by Madhya Pradesh. The Baredi Pushkala dance is believed to have originated by Lord Sri Krishna who belonged to this community of cowherds. The artists from Jharkhand displayed their ancient Natua dance which has a touch of Martial art techniques.
Smt Rani from Rajamundry presented Mayura Nrityam, the famous peacock dance while Gopika Nrityam, Bharatnayam, Thala Nrityam were also performed. The Siva Lasyam dance performed by Sri Srinivas troupe from Rajamundry stood as a feast to the eyes of devotees.
TTD Chairman Sri B Karunakara Reddy, EO Sri AV Dharma Reddy also cheered the artistes all through the Mada streets while JEO for Health and Education Smt Sada Bhargavi personally supervised the dance forms and encouraged the troupes.
A total of Art groups with 248 artists performed their skills during the Mohini Avataram.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పల్లకీ ఉత్సవంలో సాంస్కృతిక వైభవం
తిరుమల, 2023 సెప్టెంబరు 22: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం పల్లకీ ఉత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.
చెన్నై నుండి వచ్చిన కళాకారులు గురువాయూరప్పన్ అనే నృత్యకళలో శ్రీకృష్ణలీలలను చక్కగా ఆవిష్కరించారు. గుజరాతీ ప్రాచీన జానపద కళారూపం గర్భ. కళ్యాణం అనంతరం దంపతులతో కలిసి చేసే ఆనందతాండవ కళారూపం ఇది. దీన్ని సుమన బృందం అత్యంత మనోహరంగా ప్రదర్శించింది.
యం.జి.కటేకర్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర నుండి వచ్చిన డ్రమ్స్ వీనులవిందుగా సాగింది. మధ్యప్రదేశ్ ప్రాచీన జానపద కళారూపమైన బరిడిని పుష్కల బృందం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రాజమండ్రికి చెందిన రాణి బృందం మయూర నృత్యంతో కనువిందు చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశీ పుణ్యక్షేత్రంలో శివతత్వాన్ని తెలిపే అఘోర నృత్యాన్ని రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ బృందం శివలాస్యంతో నేత్రానందాన్ని కలిగించింది.
రాజమండ్రికి చెందిన లక్ష్మీ ప్రసన్న బృందం తలం నృత్యంతో అలరించింది. కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరుకు చెందిన అనురాధా క్రాంత్ బృందం భరతనాట్యంతో ఆకట్టుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన మహదేవన్ బృందం ప్రదర్శించిన గోపికా నృత్యం చక్కగా సాగింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నట్టువ అనే ఈ ప్రాచీన జానపద కళారూపాన్ని పద్మమాలిని బృందం తమ కళానైపుణ్యంతో ఆకట్టుకున్నారు. తిరుపతికి చెందిన చందన బృందం తమ కోలాట నృత్యంతో అలరించింది. మొత్తం 11 కళాబృందాల్లో 248 మంది కళాకారులు పాల్గొన్నారు.
టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి కలిసి వాహనసేవలో కళాబృందాల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి కళాకారులను ప్రోత్సహించారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.